Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కాటారం
మే ఒకటి నుంచి వారం రోజులపాటు జరగనున్న విద్యుత్ వారోత్సవాల సందర్భంగా కాటారం సబ్ స్టేషన్ వద్ద బుధవారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా భూపాలపల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని, ఎంపీపీ పంతకాని సమ్మయ్య పాల్గొని వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లా డుతూ విద్యుత్ వాడకాన్ని ఆదా చేసుకుంటే సామాన్యు లకు ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. విద్యుత్ భద్ర తపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవ సరం అధికారులపై ఉందని అన్నారు. ఏడి నాగరాజు మాట్లాడుతూ విద్యుత్ భద్రత సూత్రాలు జీవన రేఖలని అన్నారు. అధికారులు సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చునన్నారు. ఎంపీపీ సమ్మయ్య మాట్లాడుతూ విద్యుత్తును వేసేవి కాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా సర ఫరా చేయాలని కోరారు. ప్రజలకు విద్యుత్ ప్రమా దాలపై అవగాహన కల్పించాలన్నారు.ఎంపీటీసీ తోట జనార్ధన్ మాట్లాడుతూ వేసవికాలం దష్ట్యా మంచినీరు అందించుటకు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యుత్తును సరఫరా చేయాలని కోరారు. ప్రజలు విద్యుత్తు పట్ల అవ గాహన చేసుకుని నాణ్యత కలిగిన పరికరాలతో విద్యుత్ వినియోగించుకోవాలని సూచించారు. ఎస్ఐ చంద్రగిరి శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు రవీందర్రావు, కాటారం విద్యుత్ ఏఈ బి మేఘనాథ్, బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్, భూపెళ్లి రాజు, కిరణ్, శ్రీనివాస్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో నేడు ఉదయం 10 గంటలకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఏఈ గుర్రాల ప్రశాంత్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ ఆవరణలో జరిగే సదస్సుకు విద్యుత్ శాఖ ఉన్నతా ధికారులు హాజరుకానున్నందున వినియోగదారులు, రైతులు, యువకులు, మహిళలు పాల్గొనాలని కోరారు. సకాలంలో హాజరై సూచనలు, సలహాలను పాటించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.