Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యుల రైజ్ చేయడంతో పాటుగా, ఉద్యోగ భద్రత కల్పించాల ని జిల్లా ప్రధాన కార్యదర్శి బిర్రు పరమేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షురాలు పావని డిమాండ్ చేశారు. బుధవారం పంచాయతీ కార్యద ర్శుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్క రించాలని కోరుతూ స్థానిక సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మీ రామచంద్రయ్య శర్మకు వినతిపత్రం అందజేశా రు. జేపీఎస్‌ల సమస్యలను మంత్రి దయాకర్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐదు వేల ఉద్యోగాలను క్రమబద్ధీకరించిందని, పంచాయతీ కార్యదర్శులను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు..? నాలుగు సంవత్సరాలు గడిచినా జూనియర్ పంచాయతీ ఉ ద్యోగులను రెగ్యులర్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్ర భుత్వ పథకాలను గ్రామీణ స్థాయిలో ప్రజల్లోకి తీసు కువెళ్తున్న తమకు గత రెండు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తమను వెంటన్ఱే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధతం చే స్తామని హెచ్చరించారు. కార్యదర్శుల సమ్మెకు సీని యర్ కార్యదర్శులు తాజుద్దీన్, వెంకన్న గ్రామపంచా యతీ సిబ్బంది నాయకుడు కుమారస్వామి ఆధ్వర్యం లో సంఘీభావం తెలిపారు. సమ్మెలో భాగంగా పం చాయతీ కార్యదర్శుల విధులను తెలియజేసేలా ఎంపీడీవో కార్యాలయం ముందు వేసిన రంగవల్లిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పంచా యతీ కార్యదర్శులు మణికుమార్, మురళి, వీరన్న, రవి, రాజు, సురేందర్, భరత్, నరేష్, రమాదేవి, రజి త, హేమలత తదితరులు పాల్గొన్నారు.
దేవరప్పులలో...
మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణ లో ఆరవ రోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసన కోనసాగింది. డిమాండ్ల కోసం సమ్మెకు ఆప్పి రెడ్డిపల్లి సర్పంచ్ పుల్లిగిళ్ళ సుధాకర్‌తో పాటు గ్రామ స్తులు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అమ రేందర్,అనిల్ నాయక్, రాంబాబు, శ్వేత, పర్జానా, నా గరాణి, వాణిశ్రీ, సంధ్యారాణీ, ఆశ్వీని పాల్గొన్నారు.
తొర్రూర్ రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు రోజుల నుండి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెకు మద్దతు తెలు పుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలోత్ సురేష్ బాబు అన్నారు. ఈ మేరకు తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ ముందు నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగుల సమ్మె శిబిరానికి చేరుకొని వారు చేస్తున్న సమ్మెకు సం పూర్ణ మద్దతు ప్రకటంచారు. ఈ కార్యక్రమంలో సి వైఎస్ఎస్ మండల కోఆర్డినేటర్ ధరావత్ హరీష్ నాయకులు ప్రవీణ్, రాజశేఖర్, రాజేష్ పాల్గొన్నారు.
నెల్లికుదురు : జూనియర్ పంచాయతీ కార్యద ర్శుల సమాచారం పరిష్కరించకుంటే ఉద్యమాలు చే స్తామని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాకేష్ రాజేష్ రాజమణి విప్లవతో పాటు కలిసి కొంతమంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రేఖలు పట్టుకొని బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ప్రవీణ్, సరిత, ఉమేష్, మణిదీప్, అశ్విని, అరుణ, ప్రియాంక, రవితేజ, చందన పాల్గొన్నారు.
పాలకుర్తి : పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గత ఆరు రోజు లుగా పంచాయతీ కార్యదర్శులు శాంతియుతంగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం ఎం పీడీవో కార్యాలయం ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. మండల సభకు హాజరైన ప్రజాప్రతినిధు లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు.స్పందించిన ప్రజాప్రతినిధులు మండల సభలో పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత క ల్పించాలంటూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు యుగేందర్, ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షులు రమ్య, విద్యాసాగర్, వెంకటే ష్, శ్రీకాంత్, మహేందర్, సంతోష్, సతీష్, కిషోర్, మోహన్, సారయ్య, రాజు, ప్రియాంక, అనూష, పర శురాములు, గణేష్, లింగయ్య పాల్గొన్నారు.