Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరుద్యోగ జంగ్ సైరన్ సభను విజయవంతం చేయాలని తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ తెలిపారు. ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క ఆదేశాల ప్రకారం శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యాల యంలో స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ ద్వారా కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ మాట్లా డుతూ ఈనెల 8న నగరంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగ జం గ్ సైరన్ పేరిట సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సార థ్యంలో సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి కాం గ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని స్పష్టం చేశారు.తాడ్వాయి మండలం నుంచి పెద్దఎత్తున పార్టీ నాయ కులు, యువకులు భారీగా తరలిరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహ కార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ పులి సంపత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయ కులు అర్రెం లచ్చు పటేల్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, కామారం సర్పం చ్ రేగా కళ్యాణి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇందారపులాలయ, డైరెక్టర్లు యానాల సిద్ది రెడ్డి, యాషాడ మల్లయ్య, కంది లింగయ్య, సర్పంచులు నరసింహస్వామి, ఎల్లబోయిన జానకి రాంబాబు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోడి సతీష్, నాయకులు ముజాఫర్, తండాల శ్రీను, పాక రాజేందర్ పుల్లూరు నాగార్జున్, జీడి రాజు, మొక్క దుర్గయ్య, తుర్క వీర బాబు, బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్,ఎస్సీసెల్ మండల అధ్యక్షులు వావి లాల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.