Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
అకాల భారీ వర్షం వలన మండలంలోని ఏజెన్సీ గ్రామాలు కస్తూనగరం,కారుకొండ,అల్లిగూడెం, రెడ్యా తండా, కంబాలపల్లి, టేకులగూడెం, లక్ష్మీపురం, నర సాపురం, పంది పంపుల, కోయగూడెం, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కళ్ళల్లో ఆరబెట్టిన మొక్కజొన్నలు పూర్తిగా తడిసి ముద్దయిపోయినాయని, కనీసం ప ట్టాలు కప్పుకునే అవకాశం లేకుండా బలమైన ఈదు రుగాలులతో భారీ వర్షం పడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందనినిలువున ఉన్న మొక్కజొన్న ఈదురు గాలకు నేలమట్టం అయి పాడైపోయిందని శనివారం కల్లాల్లో ఉన్న మొక్కజొన్న రాశులను నేల పాలైన మొక్కజొన్న పంటలను అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రతినిధి బృందం పరిశీలించి రైతులతో మా ట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లా డుతూ తయారైన మొక్కజొన్న పంటను సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వలన మాకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు కన్నీరు మున్నేరు పె డుతూ ఆవేదన చెందారు. ఆరుగాలం కష్టపడి శ్రమ చేసి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి తీర చేతికందే సమయంలో ఈ అకాల వర్షం వలన తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందన్నారు. పంట పెట్టుబడులకు తెచ్చి న అప్పులు వడ్డీలు పెరిగి తీర్చే పరిస్థితి లేకుండా పో యిందని, మా బ్రతుకు తెరువు కూడా ప్రశ్నార్ధకంగా నే ఉందన్నారు. పంటలు నష్టపోయి ఇలాంటి స్థితిలో ఉన్న రైతాంగాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకో వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కో శాధికారి నందగిరి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ఇప్పటికీ మూడు దఫాలుగా వడగండ్ల వర్షాల వలన రైతాంగం పంటలు కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గత పర్యటనలో పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు పదివేల రూపా యలు తక్షణమే సహాయం అందిస్తానని ప్రకటించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించలేదని ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునే ప్రభుత్వం అయితే న ష్టపోయిన పంటలను సమగ్ర సర్వే నిర్వహించి ప్రక టించిన పరిహారం, పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ ఎకరాకు 50వేల రూపాయలు పంట నష్టం పరిహారం అందించాలని, రైతుల ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకు రుణాలను మాఫీ చేయించడానికి తగిన చ ర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బానోతు హౌలీ, రామచంద్ర ము రళి, ఆంగోత్ భాష, అవిరే నారాయణ, రైతులు వా సం కన్నయ్య, వాసం రామకృష్ణ, దానసరి పాపయ్య, బానోతు అర్జున్ భానోత్ బాబు, బానోతు రాములు, చాపల వీరన్న, మూతి రాములు పాల్గొన్నారు.