Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ.నాగయ్య
నవతెలంగాణ-మహాబూబాబాద్
సోషలిజంతోనే సమాజ మార్పు సాధ్యమని పేదరికం లేని సమాజా ఆవిర్బావం కోసం సీపీఎం కార్యకర్తలు సోషలిజం భావజాలం ఉత్పత్తి సరఫరా నిర్మాణం లో భాగస్వామ్యం కావాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ.నాగయ్య పిలుపు నిచ్చారు.శనివారం మానుకోటలో పెరుమాళ్ళ జగన్నాథం భవన్లో సీపీఎం ఫ్లోర్డ ర్ సుర్ణపు సోమయ్య అధ్యక్షత నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావే శంలో నాగయ్య మాట్లాడారు. సమాజ మార్పులో భాగస్వామ్యం కావడం కోసం సీపీఎం కార్యకర్తలు రాజకీయాలను అధ్యయనం చేయాలని సైద్ధాంతిక నిబద్ధత పెంచుకోవాలని ఉద్బోధించారు. సోషలిజం భావజాలం ఉత్పత్తి కేంద్రమైన 'నవ తెలంగాణ' పత్రికను ప్రతీ కార్యకర్త, నాయకుడు అధ్యయనం చేయాలని అర్థం చేసుకొని ప్రజలకు వివరించాలని కోరారు. పేదలకు న్యాయం జరిగేంతవరకు సమ సమాజం ఆవిర్భవించేంత వరకు కార్యకర్తలు మొక్కవని దీక్షతో పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు.సమాజంలోని పేదలకు కనీస అవసరాలైన భూమి... కూడు... గూడు... నీడ... కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ భూములలో పేదలు వేసిన గుడిసెలకు పట్టాలు వచ్చేంతవరకు వెనుతిరిగేది లేదని వెనకడుగు వేసేది లేదన్నారు. కేసులు పెట్టినా.... లాఠీలతోతో కొట్టినా... జైల్లో పంపినా... రక్తాలు కారినా... ప్రభుత్వ భూములను వదిలేది లేదన్నారు. సీపీఎం పోరాటాల ఫలితంగానే భూస్వాముల ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు విముక్తి కలుగు తుందని అన్నారు. సీపీఎం పోరాటాల ఫలితంగా రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూములను రక్షించేందుకు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. బిజెపి ప్రభు త్వం తప్పుడు ప్రచారంలో మత ఘర్షణలతో అధికారంలోకి రావాలని చూస్తుందని సీపీఎం కార్యకర్తలు కుటిల బీజేపీ విధానాలను అర్థం చేసుకొని ప్రజల్లో ఎండ కట్టాలని చెప్పారు. రాళ్లను పూజించే మూర్ఖ భక్తి భావజాలంతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమాజంలో శాశ్వతంగా నిలిచిపోయేది సోష లిజమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సుర్ణపు సోమయ్య, 'నవతెలంగాణ' ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ దేవేందర్ రావు, రిపోర్టర్లు పాల్గొన్నారు.