Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్ జీవోను విడుదల చే యాలని సర్పంచ్ మల్లెల రణధీర్ అన్నారు. తమ న్యా యమైన సమస్యలు పరిష్కరించాలని తొమ్మిది రో జులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తు న్న నిరవధిక సమ్మెకు కొత్తగూడ సర్పంచ్ మల్లెల రణ ధీర్ సంఘీభావం తెలిపి వారి ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మ ద్దతుగా నిలిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించా లని లేకుంటే గ్రామపంచాయతీకి తాళం వేసి తమ నిరసన తెలుపుతూ పంచాయితీ కార్యదర్శులకు మ ద్దతుగా నిలుస్తామన్నారు. ఆయన వెంట వార్డు మెం బర్ తోటకూరి సరిత మధు, పంచాయతీ కార్యద ర్శుల సంఘం అధ్యక్షులు గట్టి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి గట్టి నిరోష, కళ్యాణి,సుమన్ రెడ్డి,శ్రీనివాస్, ఇంద్రజ, కళ్యాణి, భవాని, జ్ఞానేశ్వరి పాల్గొన్నారు.
పాలకుర్తి : జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేయాలని సీపీఐ (యంయల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మా మిండ్ల రమేష్ రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేపీఎస్‌లకు ఉద్యోగ భద్రతతో పాటు ఔటింగ్ సో ర్సింగ్ పంచాయతీ కార్యదర్శిలకు న్యాయం చేయా లని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఐ ఎంఎల్ లిబ రేషన్ ఆధ్వర్యంలో పాలకుర్తిలో సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రమేష్ రాజా మాట్లాడుతూ జీపీఎస్ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, ప్రత్యక్ష పోరాటాల్లో కలసి వస్తామని రమేష్ రాజా ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి జీడి సోమయ్య, జెపిఎస్ సంఘం నాయకులు యుగంధర్, మహేష్, రమ్య, శ్రీకాంత్, చంద్రశేఖర్, సతీష్, వెంకటేష్ పాల్గొన్నారు.
నర్మెట్ట : భాగంగా తమ పిల్లలు తమ తల్లి దం డ్రులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సమ్మెలో భాగంగా పిల్లలు పాల్గొని ప్రభుత్వంన్ని విజ్ఞప్తి చేశా రు. ఈ కార్యక్రమంలో పంచాయితి కార్యదర్శిలు వం శీ, సుఖేష్ గిరి,అనిల్,నరేష్,శ్రీధర్, యాకోబ్, కళ్యాణి, సుజాత, వినరు, పాల్గొన్నారు
గార్ల : గత పది రోజులుగా జేపీఎస్‌లను క్రమ బద్ధీకరించాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమకు ట్టినట్లు కూడా లేదని వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీని వాస్ అన్నారు.స్దానిక ఎంపిడివో కార్యాలయం ఆవ రణంలో జరుగుతున్న జేపీఎస్‌ల నిరవధిక సమ్మె శనివారం 9వ చేరుకున్న సందర్భంగా జేపీఎస్‌లు రో డ్లు ఊడ్చుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్, రామకృష్ణ,సరిత, సరస్వతి,లలిత,క్రాంతి, మంగిలాల్, వెంకటేష్,కిషోర్, కిరణ్, రమేష్, వెంకటేశ్వర్లు,వెంకటేష్ ఉన్నారు.
గూడూరు : ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులేషన్ చేయాలని కోరుతూ జేపీఎస్ నుంచి పెట్టిన నిర్వాధిక సమ్మె శనివారం నాటికి 9వ రోజుకు చేరింది మండల పరిషత్ కార్యాలయంలో శ్రమదాన కార్యక్రమం చే స్తూ జేపీఎస్ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో జేబీఎస్‌లు శ్రీకాంత్, రమేష్, హరీష్, నాగమణి, గీతాంజలి తదితరులు కార్యదర్శులు పాల్గొన్నారు.