Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లా కేంద్రంలోనీ డిగ్రీ కళాశాల పక్కన కలెక్టరేట్ భవనం ఎస్సారెస్పీ కాలువ పక్కన చుట్టూ ఉన్న చెట్లు తొలగించాలని, ఘట్టమ్మ నుండి కొత్త జెడ్పి కార్యాలయ స్థలం వరకు రోడ్డు లెవెల్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీ లించారు.కలెక్టరేట్ ప్రక్కన నూతన జడ్పీ కార్యాలయ భవనం కోసం 4 ఎకరాల స్థల పరిశీలన చేశారు.అనంతరం బండారుపల్లిలోని నూతనంగా నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులు పరిశీలించారు.స్టేడియం ప్రక్కన ప్రాంతీయ రవాణా కార్యాల యం కోసం స్థలం పరిశీలించారు.సేవాలాల్ భవనం, కార్మిక్ భవన్లతో పాటు మహిళా డిగ్రీ కళాశాల స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని ములుగు తహసిల్దా ర్ను కలెక్టర్ ఆదేశించారు. బండారుపల్లి శివారులో 12 ఎకరాల స్థలంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ క్యాంపు కార్యాలయమునకు స్థల పరిశీలన చేశారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ములుగు తహసిల్దార్ సత్య నారాయణ స్వామి, పంచాయతీరాజ్ ఏఈ అజిత్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ విజేందర్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.