Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్
నవతెలంగాణ -ములుగు
వైద్య సిబ్బంది సమయపాలన పాటించి, రోగులకు మెరుగైన వైద్యం అందిం చాలనీ,స్పెషలిస్ట్ వైద్యులు ఉదయం తొమ్మిదిన్నరకు హాజరై మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వెళ్ళాల ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆదేశించారు. ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ములుగు జిల్లా ఆసుపత్రిని శనివారం సందర్శించి, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీష్ అధ్యక్షతన ఆసుపత్రి వైద్యు లతో సమీక్ష నిర్వహించారు.రెగ్యులర్, కాంట్రాక్ట్ వైద్యుల హాజరు రిజిస్టర్లను పరి శీలించి, వైద్య విధాన పరిషత్ నిబంధనల ప్రకారం వైద్యులు సక్రమంగా డ్యూటీకి హాజరవుతున్నారా, ఎంత మంది స్పెషలిస్టులు కావాలి, ఎంత మంది మంజూరైన పోస్టులు, ప్రధాన కార్యాల నిర్వహణ తదితర విషయాలపై ఆసుపత్రి సూపరిం టెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. నిపుణులైన వైద్యులందరితో సమీక్షించి,ఓపి సమయాలను అనుసరించడం, డ్యూటీ సమయంలో ఆసుపత్రిలో అందుబాటులో ఉండడం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ ములుగు వెలుగు యాప్లో హాజరు మార్కింగ్పై వైద్యులు,సిబ్బంది అందరూ తప్పకుండా సమయ పాలన పాటించంచాలని, మొత్తం స్పెషలిస్ట్ వైద్యుల క్రమం తప్పకుండా ఉదయం 9.30 గంటలలోపు ఆసుపత్రికి హాజరు కావాలని ఆదేశించారు.ఏ స్పెషలిస్ట్ డాక్ట ర్ అయినా మధ్యాహ్నం 2 గంటలకు ముందు లేదా రోగులకు ఇన్వెస్టిగేషన్ రిపో ర్టులు వచ్చే వరకు, నివేదిక ఆధారంగా చికిత్స అందించే వరకు ఆసుపత్రి నుండి బయటకు వెళ్లకూడదనీ ఆదేశించారు.పేషెంట్లలో రౌండ్లు సమయానికి ప్రారం భించి, ఆ తర్వాత తరచుగా సందర్శనలు చేయాలన్నారు. సంబంధిత సిబ్బందికి సరైన సూచనలు ఇవ్వాలనీ,రోగుల యోగక్షేమాలను తరచుగా సిబ్బందిని విచారిం చాలన్నారు.స్థానికేతరుల పేరుతో రోగులెవరిని నిరాకరించవద్దని,ప్రతిరోగికి ప్రా ధాన్యత ఆధారంగా చికిత్స అందించాలనీ సూచించారు.పల్మోనాలజిస్ట్, ఫిజిషియ న్, అనస్టిషియా వైద్యులు కలిసి ఐసియూ సేవలను నిర్వహించే బాధ్యతను తీసు కొని, వైద్యులు తమ డ్యూటీ వేళల్లో ఉండాలనీ ఆదేశించారు. రేడియాలజీ సేవల కు డిమాండ్ ఉందని, అవసరమైన రేడియాలజిస్టును ఏరియా ఆసుపత్రి ములు గుకు, సామాజిక ఆరోగ్య కేంద్రం ఏటూరునాగారం, వెంకటాపురం నుండి డిప్యూ ట్ చేస్తామని, స్పెషలిస్ట్ డాక్టర్లందరూ ఓపి టైమింగ్స్, డ్యూటీ సమయాల్లో అందు బాటులో ఉండ తగిన సూచనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేవు అన్నిసేవలు ప్రారంభించబడతాయని, జిల్లా కలెక్టర్ కూడా అవసరాన్ని బట్టి సిబ్బందిని నిమగం చేశారనీ, జిల్లా పరిపాలన నిధుల నుండి జీతాలు ఇస్తున్నారనీ, తీసుకోవలసిన జాగ్రత్తలపై కూడా పర్యవేక్షి స్తున్నారన్నారు. డెంగ్యూ, మలేరియా కేసులను అన్ని ఆసుపత్రుల పరిధిలోనీ జిల్లా యంత్రాంగం,అలాగే ఐటీడీఏ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. సమా వేశంలో సిఎఎస్లు డాక్టర్ పి.రఘు, డాక్టర్ పి.జాన్సన్, సిఎఎస్ఎస్లు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ చిరంజీవ, డాక్టర్ ఈ.పట్టాభి రామారావు,డాక్టర్ ఎ.సజ న, జీడిఎంఓలు,డాక్టర్ సుష్మ, డాక్టర్ తేజస్విని, డాక్టర్ అనిత శ్రీ, డాక్టర్ ప్రశాంత్ నాయక్, డాక్టర్ నిఖత్, ఇతరులు వైద్యులు హాజరయ్యారు.