Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా తహసీిల్దార్కు వినతి
నవతెలంగాణ-వెంకటాపూర్
గత కొన్ని రోజుల నుండి అకాల వర్షాలు వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని రైతుకూలీ సంఘం ప్రధాన కా ర్యదర్శి మొగిలి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులతో ధర్నా రాస్తారోకో తహసిల్దార్‌కు డిమాండ్ల తో కూడిన వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ నష్టపోయిన రైతులకు సీఎం ప్రకటించిన పదివేల రూపాయలు వెం టనే అందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మొక్కజొన్న ఎకరానికి 20,000 వరి పంటకు 25,000 మిర్చి పంటకు 50,000 మామిడి పంటకు 75 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లక్ష్మీదేవి పేటలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 105లో ఉన్న 134 ఎక రాలు భూమిని తక్షణమే ఇళ్ల స్థలాలు కింద కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ని ర్మించే విధంగా కృషి చేయాలని కోరారు. తడిసిన పంటలను ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని తెలిపారు ఇప్పటికైనా అధికారులు రైతులపై దృష్టి సాధించి సర్వేలు చేపట్టి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో బొమ్మిడి సాంబయ్య, మామిడి నరసింగరావు, కృష్ణ, ఎల్లా రాములు, నరసయ్య, రాజయ్య, మొగిలి, మధుకర్, ఎం.రమ, ఎండి.రహీన, భారతమ్మ మౌనిక, విజయ, నవీన్, లక్ష్మి నరసయ్య, ఎం.సరోజనతోపాటు రైతులు, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.