Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పటిష్టంగా సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2007
నవతెలంగాణ-టేకుమట్ల
వయోవద్ధులైన కన్న తల్లిదండ్రులను వారి సంతానం వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం జైలుకు వెళ్లాడం తప్పదని సిడిపిఓ అవంతి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఆదేశాల మేరకు శనివారం మండలం లోని ఎంఆర్సి బిల్డింగ్ లో ఎంపీడీవో అనిత అధ్యక్షతన జరిగిన సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2007 చట్టంపై పరిధిలోని అధికార యంత్రాంగానికి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, మండల ప్రత్యేక అధికారి రంగారావు, జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, సిడిపిఓ అవంతిక మాట్లాడుతూ వద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ముఖ్యంగా వయోవద్ధులకు పోషణ, రక్షణ తమ పిల్లలు చూసుకోవడం లేదని కలెక్టర్ భవిష్ మిశ్రా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ కి ఫిర్యాదులు వస్తున్న క్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అన్నారు. వయోవద్ధులు కుటుంబ సభ్యుల నుంచి నిరాదరణకు గురైన వారిని గుర్తించి వారి సమస్యలను గ్రామ స్థాయిల్లో, మండల్ స్థాయి లోనే వెంటనే పరిష్కారించి వయోవద్ధులకు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం అందించాలన్నారు. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్నవా ళ్లపై కేసులు నమోదు చేయాలని తల్లిదండ్రుల చేత బలవంతంగా ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న కూడా తిరిగి మళ్లీ తల్లిదండ్రుల పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం కూడా ఉందని వివ రించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రామారావు, ఎంపీ ఓ సురేష్, ఏపీవో,మాధవి, ఏపీఎం రమేష్ ఐకెపి సరోజన, ఐసిడిఎస్ సూపర్వైజర్, మండ ల పరిషత్ అధికారులు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.