Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి
నవతెలంగాణ-మల్హర్రావు
కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు విధిస్తూ రైతులను నిర్వహకులు ఇబ్బందులకు గురిచేయెద్దని భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిణి ఆదేశించారు. తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము ఆధ్వర్యంలో శనివారం తాడిచెర్లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమే ప్రారంభిం చారు.ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు పండిం చిన ప్రతి గింజను మద్దతు కొనుగోలు చేయాలన్నారు.కొనుగోళ్లలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు గోనె శ్రీనివాస్ రావు,మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ అనంతరెడ్డి, వైస్ చైర్మన్ పుట్టపాక శ్రీని వాస్, సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,రాజేశ్వర్ రావు, మంథని మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ దేవేర్నేని రాజేశ్వరరావు, కాళేశ్వరం దేవస్థాన డైరెక్టర్ బండి రాజయ్య,కొప్సన్ ఆయూబ్ ఖాన్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి ,యాదగిరిరావు పాల్గొన్నారు.