Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంహెచ్ నగర్లో అధికార పార్టీ నేతల ఆగడాలు
- ఇంటిని కూల్చి రాత్రికి రాత్రే బీఆర్ఎస్ జెండాగద్దె నిర్మాణం
- ఖాళీ ప్లాటు కనిపిస్తే ఖతమే..
- స్థలాన్ని విక్రయించాలని నేతల హుకుం..
- స్థలం దక్కకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యే శరణ్యం
- న్యాయం చేయాలని నిరుపేద బాధితురాలి వేడుకోలు
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ నగరంలో అధికార బీ ఆర్ఎస్ పార్టీ నేతల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. ఒక పక్కన భూక బ్జాలకు పాల్పడుతున్నవారిపై, పేదల ఇళ్ల ను ఆక్రమించిన వారిపై పోలీసులు కఠి నచర్యలు తీసుకున్నప్పటికీ నేతల ఆగ డాలు మాత్రం ఆగడం లేదు. గ్రేటర్ వ రంగల్ 13వ డివిజన్ పరిధిలో ఎంహెచ్ నగర్ పేరుతో సర్వేనెంబర్ 308లోని 10ఎకరాల ప్రభుత్వ స్థలంలో 2003లో సీపీఎం ఆధ్వర్యంలో 650 గుడిసెలు వే సుకుని పేదల నివసిస్తున్నారు. కార్యక్ర మంలో వారికి హౌస్ హౌల్డర్ సర్టిఫికె ట్ వచ్చింది. ఇంటి పన్ను, కరెంటు బిల్లు లు కడుతున్నారు. కానీ ఇటీవలకాలంలో స్థానిక కార్పొరేటర్ సురేష్ జోషి అండతో స్థానిక నాయకులు ఓ కమిటీగా ఏర్పడి ఖాళీ ఫ్లాట్లు కనిపిస్తే కబ్జాలకు పాల్పడు తున్నారు. ఇదే క్రమంలో కాలనీకి చెందిన దామెర మైబుబి (మంజుల) అనే మహి ళ ఇంటిని శుక్రవారం రాత్రికిరాత్రి తీసివేసి ఆ స్థానంలో బిఆర్ఎస్ జండే గద్దె నిర్మానాన్ని చేపట్టారు. దీంతో శనివారం బాధితురాలు మైబుబి తన కుటుంబ స భ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతు 17 ఏళ్ల క్రితం తాను గుడిసె వేసుకుని నివసిస్తున్నానని, తనకు హౌస్ హౌల్డర్ సర్టిఫికెట్ వచ్చిందని ఇంటిపన్ను, కరెంటు బిల్లులు కూడా కడుతున్నానని తెలిపారు. ఇటీవల కాలంలో తన ఆరోగ్యం బాగాలేక తన తల్లి గారి ఊరైన వర్ధన్నపేటకు వెళ్లగా ఎం హెచ్నగర్ కాలనీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచె రాజు తనకు ఫ్లాట్ అమ్మాలని ఒత్తిడి చేయగా అందుకు నేను ఒప్పుకోలేదని తనకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారని ఇల్లు ఏకైక ఆధారమని ఎంతో ప్రాధేయపడ్డ వినలేదన్నారు. ఇట్టి విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సురేష్ జోషి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఫ్లాటు కంచరాజుకు అమ్మాలని నీకు మరోచోట చూపిస్తామనగా అందుకు తాను నిరాకరించడం జరి గిందన్నారు. కానీ శుక్రవారం రాత్రి సమయంలో తన ఇల్లును తీసి వేయించి బీ ఆర్ఎస్జెండా నిర్మాణాన్ని చేపట్టా రని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫ్లా టు తనకు దక్కాలని లేని పక్షంలో కు టుంబంతో సహాఆత్మ హత్య చేసు కుంటానని అందుకు స్థానిక కార్పొరే టర్తోపాటు కంచె రాజు, సంచు కృష్ణ, కప్పల స్వామి, క కురువల రా జు, బాదాని సంతోష్ లే కారణమని అన్నారు.
బీజేపీ నాయకుల సంఘీభావం
ఎంహెచ్ నగర్లో మైబుబి (మంజుల) ఆందోళన చేస్తున్న విషయం తెలు సుకున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం బీజేపీ నాయకులు కుసుమ సతీష్, డా క్టర్ వన్నాల వెంకటరమణలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలి చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుం బానికి చెందిన మై బూబి ఇల్లు ఆక్రమించుకొని పార్టీ జెండా నిర్మించడం సరికాదన్నారు. రెండు రోజు ల్లో ఆమెకు న్యాయం చేయాలని లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేప డుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో 13,14,3వ డివిజన్ల అధ్యక్షులు జన్ను సుబ్రహ్మణ్యం, కొ త్తకొండ రాజు, వడ్డే మానుకోట తిరుపతి, 26వ డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మారుమూల ప్రవీణ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు మంతెన అని త, బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు పిట్టసరస్వతి, 14వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు మంతెన దేవి క, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మంతెన చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.