Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
నవతెలంగాణ-సుబేదారి/వరంగల్
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమా రి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధి కారులతో కలిసి కంటివెలుగు, ఆరోగ్య మహిళ, సిఎంఆర్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇళ్ల స్థలాల వివరాలు అప్లో డింగ్, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58,59, 76,118 ప్రభుత్వ జిఓల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, ఆయిల్ ఫామ్సాగు, ఎరువుల పర్యవేక్షణ వ్య వస్థపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ కంటి వె లుగు,ఆరోగ్యమహిళా శిబిరాలను జిల్లా కలెక్టర్లు ఎప్ప టిక ప్పుడు తనిఖీ చేస్తూ నాణ్యమైన సేవలు ప్రజలకు అందే లా చర్యలు తీసుకోవాలనిసూచించారు. ధాన్యం కొనుగో లు కేం ద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతుల వద్ద నుంచి చి వరిగింజ వరకు మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు చేయా లని, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అకాల వర్షాల కార ణంగా తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరపై కొనుగోలు చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో అవసరమైన మేర మౌలిక వసతులు కల్పించాలని, గన్నీ బ్యాగుల కోరత లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న సిఎంఆర్ రైస్ డెలీవరి పై జిల్లాల వారీగా సీఎస్ సమీక్ష నిర్వహించారు. అధికంగా పెండింగ్ ఉన్న జిల్లాలు 10 రోజులో మిగిలిన జిల్లాలు 3 రోజులో సీఎంఆర్ రైస్ డెలీవరి చేయాలని సీఎస్ తెలిపారు. జీఓ 58 కింద పట్టాల పంపిణీ కార్యక్రమం 3 రోజులో పూర్తి కావాలని, జీఓ 59 కింద 10750 మంది దరఖాస్తుదారులు రూ.3లక్షలలోపు రుసుము చెల్లించాల్సి ఉందని, వచ్చే వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫస్ట్ ఇనస్టాల్మెంట్ చెల్లిం చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీఓ 76 కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులు వచ్చేవారం నాటికి పూర్తి చేయాలని సీ ఎస్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బె డ్ రూం ఇండ్ల ఎంపిక చేసిన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల వరకు విస్తిర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయ డం జరిగిందని, ప్రస్తుత సంవత్సరం 2 లక్షల పైగా ఎకరాల లక్ష్యంతో కార్యాచరణ తయారు చేసామని, ప్రతి నెలా లక్ష్యాలను నిర్దేశించుకోని వాటి సాధన దిశగా కషి చేయాలని సీఎస్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లోజిల్లా కలెక్టర్లు సిక్తా పట్నా యక్ జిల్లాలోని టు బీహేచ్కే హౌజెస్ డిస్ట్రిబ్యూషన్ ఎమ్మె ల్యేతో మాట్లాడి త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ వీడి యో సమావేశంలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, అశ్వినీతానాజీ వాకడే, డిఆర్వో వాసు చంద్ర, పరకాల ఆర్డీవో రాము, డిఎం హెచ్ వో సాంబశివ రావు, మార్కెటింగ్ అధికారి సురేఖ, డీ.సీ.ఎస్.ఓ వసంత లక్ష్మి, అగ్రికల్చర్ అధికారి దామోదర్ రెడ్డి సంబంధిత అధికా రులు పాల్గొన్నారు.