Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీ పాలన నుండి భారతదే శాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతో మన్యంలో ఆదివాసి ప్రజలను సమీకరించి సాయిల తిరుగుబాటు చేసి తెల్లదొరలకు గుబులు పుట్టించిన విప్లవ మన్యం వీరు డు అల్లూరి సీతారామరాజు అని పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇడం పాక శ్రీశైలం, రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతకాని రాకేష్, పివైఎల్ మండల అధ్యక్షులు కల్తి వెం కన్నలు కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 99 వ వర్ధంతి సందర్భంగా పిడి ఎస్యు, పివైఎల్ మండల కార్యవర్గాల ఆధ్వర్యంలో పాలడుగు కృష్ణ స్మారక భవన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు అల్లూరి చిత్రపటంతో ర్యాలీ నిర్వహించి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో దోపిడీ పోవాలని అందరికీ స్వేచ్ఛ స్వతం త్రాలు ఉండాలని అల్లూరి ఆశించినా నేటి భారత దళారి పాలకవర్గాలు అనేక సా మ్రాజ్యవాద దేశాలకు వనరులను దోచిపెట్టేందుకు అనుకూల చట్టాలను విధాన పరంగా ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రం గాలను ప్రైవేటుపరం చేయడం వలన నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుందని, యువతను పెడదారిన పట్టిస్తూ దేశంలో మత్తు పదార్థాలు మద్యం విచ్చలవిడిగా విస్తృత పరుస్తు యువతను చెడగొడుతున్నారని ఆరోపించారు. విద్యా కార్పొరేటీ కరణ, నిరుద్యోగం, ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ, బ్రాహ్మణీయ ఫాసిస్ట్ విధానా లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడి ఎస్యు, పివైఎల్ నాయకులు వంశీ, సు ధాకర్, రాఖి, ఏఐకెఎమ్ఎస్ నాయకులు యాదగిరి యుగంధర్, గట్టి వెంకన్న, జా మ్లా, గుజ్జు దేవేందర్, మద్దెల సమ్మయ్య, ఇఫ్టూ నాయకులు రాజమల్లు, వెంకీ, కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : బ్రిటిష్ సరళ గుండెలోకి దూసుకెళ్లిన విప్లవబణం స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుని భారత స్వాతంత్య్ర చరిత్రలో ఒక మహౌద్వాల శక్తి అని ఇతను జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమం లో ఒక ప్రత్యేక అధ్యాయం సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని పివైఎల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. సక్రు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బాల్య తండా గ్రామంలో అల్లూరి సీతారామరాజు 99 వ వర్ధంతి సందర్భంగా పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు వారసత్వంలో దేశ ప్రజలందరూ పోరాడాలని, నేడు దేశంలో అటవీ సంరక్షణ నియమాల పేరుతో అడవి సంపద ను ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను కార్పోరేట్ కంపెనీలకు దోచిపెట్టె కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, మోడీ ఆదివాసులకు గిరిజనులను పేదలను అడవుల నుండి వెళ్ళగొట్టే దుర్మార్గమైన చట్టాలను చేస్తున్నారన్నారు. గిరిజనులకు ఆదివాసులకు దళితులకు గిరిజనేతర పేదలకు జరుగుతున్న అన్యాయాలపై అ ల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బానోత్ సుధాకర్ నాయక్, పడిగ సురేష్, పివైఎల్ మండల అధ్యక్షులు జి.రమేష్, మండల కార్యదర్శి తోకల వెంకన్న, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు జి.శ్రీను, సుమన్, రామచంద్రపురం మురళి,దిడ్డి లింగయ్య, నర్సింగ్, వెంకట్ రామ్, పెంట్యా తదితరులు పాల్గొన్నారు.