Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ లావుడియా రవి నాయక్
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
హనుమకొండ నగరంలోని 02 వ డివిజన్ రెడ్డి పురంలోని విజయ లక్ష్మి కాలనీ రోడ్డు నెంబర్ 02 కు సంబందించిన కాలనీ నూతన కమిటీని ఆది వారం ఎన్నుకోవడం జరిగింది. కాలనీ అధ్యక్షులుగా గొట్టె ముక్కుల మధుకర్ రావు, ప్రధాన కార్యదర్శిగా సర్జన సురేష్, కోశాధికారిగా భోగం నరేందర్‌ను ఎన్నుకున్నారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ హాజరై కాలనీ నూతన కమిటీ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్లానని అభివద్ధికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చిన తన దష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం కాలనీ నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాలనీ భివద్ధికి కషి చేస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ కమీషనర్, అధికారుల దష్టికి సమస్యలు తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం కార్పొరేటర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు పసుల వెంకటస్వామి,సంయుక్త కార్యదర్శి గంగినేని సతీష్ , సిద్దోజు రాకేష్, గౌరవ సభ్యులు పసుల సంజీవ్, పోతుల రఘు, అనిల్, మోటపోతుల సురేష్, ఇంచార్జ్ క్రాంతి కుమార్, కాలనీ సభ్యులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.