Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గౌరబోయిన మోహన్రావు
నవతెలంగాణ- తాడ్వాయి
కాటాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గౌరబోయిన మోహన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం కాటాపూర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాటాపూర్ గ్రామానికి గంగారం, కాటాపూర్, దామర్వాయి, పంబాపూర్, నర్సాపూర్(పిఏ) అంకంపల్లి, బీరెల్లీ, రంగాపూర్ 8 గ్రామ పంచాయతీల తో పాటు ఇంకా పది గల ఆమ్లెట్ గ్రామాలు ఉన్నాయని, సరిహద్దు మండలాల నుంచి కొన్ని గ్రామాలను తీసుకొని కాటాపూర్ గ్రామాన్ని మండలం గా ప్రకటించాలని పేర్కొన్నారు. కాటాపూర్కు అన్ని సౌకర్యాలతో పాటు, మండలానికి ఉండవలసిన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ గ్రామ పంచాయతీల నుండి తాడ్వాయి మండలానికి వెళ్లడానికి ప్రజలు, రైతులు, విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇన్చార్జి మంత్రి పరిశీలించి, కాటాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరారు. కాటాపూర్ను మండలం గా ప్రకటించకపోతే అంచలంచలుగా ఉద్యమం ఉధతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు ఎల్లబోయిన ఆది నారాయణ, నాలి మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.