Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ
మండలంలోని చం ద్రుగొండ గ్రామానికి చెం దిన బోడకుంట్ల సుధాకర్ వ్యవసాయపు ఎద్దు మేత మేస్తున్న సమయంలో గత వారం రోజులుగా కురు స్తున్న వర్షాలకు విద్యుత్ వైర్ తెగి వ్యవసాయ ఎద్దు కు తాకడంతో వ్యవసాయ వు ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు దీని విలువ లక్ష పదివేల వరకు ఉంటుందని రైతు బోడకుంట్ల సుధాకర్-సుజాత బోరున విలపించారు. చంద్రు గొండ గ్రామంలో వ్యవసాయ రైతు బోడకుంట్ల సుధాకర్‌కు చెందిన వ్యవసాయ ఎద్దులు మేత మేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ గురై ఒక ఎద్దు మృతి చెందగా వారి కుటుంబాన్ని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంగని సూరయ్య పరామ ర్శించారు. అనంతరం సూరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా సుధాకర్ కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బక్కి రాజమ్మ సాంబయ్య, బిఆర్ఎస్ నాయకులు సంగని వీరన్న, శ్రీనివాస్, సుధాకర్, ఎర్ర విజేందర్, బోనగిరి వెంకన్న, మంకాల మాని, సిరిపోతుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.