Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాసా జిల్లా అధ్యక్షులు సారంపెళ్లి వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
హన్మకొండ రాంనగర్లో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షులు సారంపెల్లి వాసుదేవరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వాసు దేవ రెడ్డి మాట్లాడుతూ... గ్రామాల లో ఉపాధి హామీ పనులు సరిగా జరపడం లేదని,చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. అలా జరుగకుండా ప్రజలను వ్యవసాయ కార్మిక సంఘం తరుపున ఎప్పటికి అప్పుడు చైతన్యం చేస్తూ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు మాట్లాడుతూ వ్యవసాయ కూలి రేట్లు రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి హామీ పనిరోజులను 200 రోజులకు పెంచాలని అన్నారు. మే 15 నుండి 25 వ తారీకు వరకు జిల్లా లోని వివిధ గ్రామాల సమస్య ల ను తెలుసుకోవడానికి బైక్ యాత్ర చెయ్యాలని జిల్లా కమిటీలో తీర్మానం చేసారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు చిలుక రాఘవులు , గబ్బేట సతీష్, ఈర్ల సురేందర్, వేలు రజిత, జూకంటి పద్మ,దేవర లత, అజ్మీరా బిక్షపతి, జోరిక మొగిలి, సుధాకర్,భాగ్య తదితరులు పాల్గొన్నారు.