Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శాంతియుత నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 10వ రోజుకు చేరింది.కార్యాచరణలో భాగం గా మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని దుబ్బపేట గ్రామపం చాయతీ సర్పంచ్ అజ్మీర ప్రమీల రాజునాయక్ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ,అన్నదానం చేసి, శీతల పానీయాలు అందించారు.అనంతరం సర్పంచ్ మాట్లాడారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత నాలుగు సంవత్సరాలగా సర్పంచ్ లతో కలిసి గ్రామాల అభివద్ధికై చాలా నిబద్ధతతో పని చెస్తు న్నారని చెప్పారు. వారు ఎప్పటికప్పుడు సర్పంచ్ లతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక ప్రజాసంక్షేమ పథకాలను, కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసారని తెలిపారు. ఇప్ప టికైనా సీఎం కేసీఆర్ కార్యదర్శులను వెంటనే రెగ్యు లరైజేషన్ జీవో ఇచ్చి, వారికి ఉద్యోగ భద్రత కల్పిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బపేట గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ శ్యామల్ సింగ్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు భూక్య రవీందర్ నాయక్, యూత్ సభ్యులు భూక్య సుమన్ నాయక్, అజ్మీర సనత్ నాయక్,రాజు నాయక్ పాల్గొన్నారు.
కార్యదర్శుల ఆరాటం ఆగని పోరాటం
గణపురం : జూనియర్ పంచాయతీ కార్యద ర్శుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి పదవ రోజుకు చేరుకుంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు చేస్తున్న పంచాయితీ కార్యదర్శుల రోజు కోక వినూత్న రీతిలో. నిరసన తెలుపుతున్నారు. పంచాయతీ కార్యదర్శులను గత నాలుగు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేయించుకొని వారిని నట్టెట ముంచాడ న్నారు. తమ న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించాలని వేడుకున్నారు సమ్మె న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదన్నారు. పంచాయతీ కార్యదర్శులు శరత్, పుప్పాల శ్రీకాంత్, ముక్కెర హేమంత్, సాయిని రమేష్, శఫీ, రాజు, అజరు, నరేష్, రాకేష్, నవీన్, శ్రావణి, దివ్యశ్రీ, సరిత, గౌతమి తదితరులు పాల్గొన్నారు.