Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్
సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గత కొద్ది రోజు లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మండలంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన నగరబోయిన భద్రమ్మ కు రూ.65000 మంజూరు చేపించి ఎల్ఓసి లెటర్ ను ఆదివారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో కుటుంబ సభ్యులకు అందించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని గత ప్రభుత్వాల హయాంలో సిఎం సహాయనిధి అంటే ఆంధ్ర ప్రాంతానికే పరిమితం అయ్యేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ పాలనలో కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ని తీర్చిదిద్దుతుకుం టున్నాయని అన్నారు. ఆరోగ్యశ్రీలో లభించని చికిత్స కోసం పేదలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తున్నట్టు తెలి పారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సావురే కమల రాజేశ్వర్ రావు,బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.