Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య
నవతెలంగాణ-పెద్దవంగర
రైతుల సౌలభ్యం కోసమే కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. ఆదివా రం చిన్నవంగర, బంగారు చెలిమి తండా, లొట్లబండ తండాల్లోని ధాన్యం కొను గోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. నిన్న రాత్రి అకాల వర్షాలు కురవడం తో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఐలయ్య మా ట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, రైతాంగం అభ్యున్నతి కోసం అనేక పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. మండలంలోని రైతులు పండించిన ధాన్యాన్ని జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఇండిస్టీస్కు పంపిస్తున్నారు. సుదూర ప్రాంతం కా వడంతో ధాన్యం రాకపోకలకు సంబంధించి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. విషయాన్ని గమనించిన ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి ఫోన్ లో జిల్లా కలెక్టర్ శశాంకతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడా లన్నారు. దీంతో మంత్రి ఆదేశాలతో చిన్నవంగరలోని లక్ష్మివాసవి రైస్ మిల్లులో నే ధాన్యం తీసుకోవాలన్నారు. నేటి నుండి చిన్నవంగర మిల్లులోనే ధాన్యం తీసుకోనున్నట్లు తెలిపారు. కొనుగోలులో కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వేగంగా మిల్లర్లలకు తరలించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో రైతు కోఆర్డినేటర్ పాకనాటి ఉపేందర్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి సభ్యుడు కొండపల్లి విజయపాల్ రెడ్డి, ధరావత్ దేవేందర్, జాటోత్ పుల్ సింగ్, జలగం శేఖర్, అంగోత్ రవి, జాటోత్ శ్రీనివాస్, మండల ఎస్టీ సెల్ ప్రధాన కార్య దర్శి ధరావత్ బాలు, ఉపసర్పంచ్ ధరావత్ శంకర్, యూత్ నాయకులు ధరా వత్ ఎల్మా, ధరావత్ నవీన్, ధరావత్ లక్ష్మణ్, ఐకేపీ అధ్యక్షురాలు ధరావత్ విజ య, సీఏ సంధ్య, సెంటర్ ఇన్చార్జీలు జాటోత్ యాకు, జాటోత్ సాయి, జాటోత్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.