Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య
నవతెలంగాణ-పాలకుర్తి రూరల్
ఇటీవల వడగళ్ల వానలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రై తులను ఆదుకోవాలని సిపిఐఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య డిమాండ్ చేశారు.ఆదివారంస్థానిక మండల కేంద్రంలో సాయుధ తెలంగాణ పోరాట యో ధురాలు చాకలి ఐలమ్మ భవనములో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇస్తా నన్న ప్రభుత్వం నెలరోజులు అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి సహాయం అందించకపోవడం శోచనీయం అన్నారు. అదే విధంగావర్షాలకు కల్లాల వద్ద తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పదేపదే ప్రకటనలు చేసిన నుతడిసిన ధాన్యం కొనుగోలు చేయకపోగా తడి, తాలుపేరుతో అదనంగా ఖిలా లు తూకం వేస్తున్నారని అన్నారు.అయినప్పటికీ మిల్లుల వద్ద లారీలు పోయేస రికి మిల్లు యాజమానులు లారీ ఒక్కంటికి ఐదు నుంచి పది క్వింటాళ్లు కోత విధి స్తున్న పరిస్థితి నెలకొంటుంది. తడిసి మొలకెత్తిన ధాన్యం ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క కింటోలు ధాన్యం కొన్న పరిస్థితిలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం తేమ శాతం నిబంధన లేకుండా రైతుల వద్ద ఉన్న పూ ర్తి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు సోమసత్యం, సోమ అశో క్ బాబు, ముసుగు ఇంద్రారెడ్డి, బెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.