Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
బహుజన రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యమని బీఎస్పీ మండల కన్వీనర్ ఈదునూరి ప్రసాద్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగే బీఎస్పీ తెలంగాణ భరోసా సభకు బీఎస్పీ మండల కన్వీనర్ ఈదునూరి ప్రసాద్ ఆధ్వర్యం లో తొర్రూరు మండల నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లా డుతూ తెలంగాణ ప్రజలకు దొరల గడిల పాలన నుండి విముక్తి కల్పించేందుకు ఆర్థిక, సామాజిక, రాజకీయంలో సమానత్వం కోసం కృషి చేస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు బీఎస్పీతోనే న్యాయం జరుగుతుందని, బీఎస్పీ అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బీఎస్పీ మండల నాయకులు రాజేశ్వరి, సంపత్, ఐలయ్య, వెంకటాద్రి, దామో ధర్, శ్రీకాంత్, రహీమ్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర : బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆది వారం సరూర్ నగర్ స్టేడియం లో నిర్వహించిన తెలంగాణ భరోసా బహిరంగ సభకు మం డలం నుండి బీఎస్పీ నాయకులు తరలివెళ్లారు. బహుజన ధర్మం పాటిద్ధాం.. బహుజన రాజ్యం సాదిద్ధాం అనే నినాదంతో నిర్వహించిన సభకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఎస్పీ మండల కన్వీనర్ రాంపాక కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఎస్పీని ప్రజలు ఆదరించాలన్నారు. సభ కు తరలివెళ్లిన వారిలో జనగాం జిల్లా మాజీ అధ్యక్షుడు యాసారపు ప్రవీణ్, పట్ట ణ కన్వీనర్ చిలుక మల్లేష్, పాలకుర్తి నియోజకవర్గ కోశాధికారి రాంపాక అనిల్, యాసారపు సతీష్, యాసారపు రమేష్, శ్యాం, శ్రీను, రాజు, బాలాజీ ఉన్నారు.