Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ-మహబూబాబాద్
రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏఐకె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సూదర్శనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మహబూబాద్లోని పెరుమాండ్ల జగన్నాధం భవనంలో వరంగల్ ఉమ్మడి జిల్లాల సమావేశానికి హన్మకొండ జిల్లా రైతుసంఘం కార్యదర్శి ఎం.చుక్క య్య అధ్యక్షత వహించారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలు సుకొని వారికోసం పోరాడాలని పిలుపు నిచ్చారు. జూన్ రెండవ వారంలో ఉమ్మ డి జిల్లా రైతు శిక్షణ తరగతులు వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రంలో జరుగుతాయని జిల్లా కార్యదర్శి శెట్టివెంకన్న తెలిపారు. మే16 నుండి 23 వరకు సంఘ సభ్యత్వం చేర్పించాలని, జిల్లా, మండల కమిటీలు సదస్సులు జరపాలని నిర్ణయించారని తెలిపారు. ఈ సమావేశంలో మహబూబాద్ జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు గునిగంటి రాజన్న, శెట్టివెంకన్న, ములుగు కార్యదర్శి ఎండి.గపూర్, వరంగ ల్ అధ్యక్షులు పుచ్చకాయల కృష్ణారెడ్డి, జనగామ జిల్లా కార్యదర్శి భూక్య చందు, రాష్ట్ర కమిటీ సభ్యులు మర్థినేని పాపారావు, నల్లపు సుధాకర్, మహబూబాద్ జిల్లా నాయకులు డి.హేమానాయక్, కనకం అలివేలు, బొబ్బ వెంకటరెడ్డి, మల్లెడి కోట య్య, కె.సైదులు, పి.పుల్లయ్య, ఇస్లావత్ జోగ్యా తదితరులు పాల్గొన్నారు.