Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
గ్రామ పంచాయతీ కా ర్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉ ద్యోగ భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు ముద్దసాని సురేష్ డిమాండ్ చేశారు. సోమవా రం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొనసాగుతున్న జీపీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు నామమాత్రంగా జీతాలు పెంచి, చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పంచాయతీ కార్మికుల వివిధ కేటగిరిలను రద్దుచేసి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తీసుకొ చ్చిందన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా. జీవో 51 తీసుకుని రావడం వల్ల కారోబార్తో మల్టీపర్పస్ వర్కర్ విధానంలో భాగం గా ప్రజా ప్రతినిధుల ఇండ్లలో వ్యక్తిగత పనులు కూడా చేయించడం దారుణం అన్నారు. వెంటనే జీవో 51 రద్దు చేసి, జీపీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు స మస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముత్యాల పూర్ణచందర్, అనపురం శ్రీను, దాసరి శ్రీనివాస్, ముక్తార్ పాషా, రంగు మురళి, జాటోత్ వెంకన్న, ఓరు గంటి సతీష్, పన్నీరు వేణు, టీజీకేఎస్యు మండల అధ్యక్షుడు కాసాని అశోక్, ఉపాధ్యక్షుడు సుమన్, కార్యదర్శి దేవా, కోశాధికారి కళ్యాణ్, సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు దేవేందర్, కుమారస్వామి, చిలుక పవన్, ప్రమీల, వెంక టమ్మ, యాకయ్య, ఎల్లమ్మ, రాజు, మైసయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.