Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ-హన్మకొండ
గత 20,25 ఏళ్లుగా ప్రభుత్వ భూములు గుడ ిసెలు వేసుకున్న నిరుపేదలకు నీడ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 58వ జీవో ద్వారా పట్టాలిస్తుందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కార్మిక దినోత్సవ మాసం సందర్భంగా మే 1 నుండి 31 వరకు నిర్వహిస్తున్న కార్మిక ఉద్యోగ సంక్షేమ మా సోత్సవ కార్యక్రమంలో భా గంగా సోమవారం ప్రభు త్వ చీఫ్‌విప్ దాస్యం విన యభాస్కర్ స్థానిక కార్పొరే టర్ మామిండ్ల రాజు, అధి కారులతో కలిసి గ్రేటర్ వ రంగల్ 31వ డివిజన్ ప రిధిలోని దీన్‌దయాళ్ నగ ర్, జ్యోతిరావుపూలే కాలనీ ల్లో నివసిస్తున్న అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికుల ఇళ్లనుక్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితుల ను, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకొని అర్హులైన వారికి పట్టాలిచ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ నిరుపేదలకు గూడు నీడ కల్పించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెం.58ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తద్వారా గుడి సెవాసుల 40 ఏళ్ల నిరీక్షణను కెేసీఆర్ తీర్చారన్నారు. అవగాహన లేక చాలామంది గుడిసెవాసులు దరఖా స్తు చేసుకోవడం లేదని అందుకే క్షేత్ర స్థాయిలో నిరు పేదలకు అవగాహన కల్పించేందుకే గుడిసెవాసుల ప్రాంతాల్లో పర్యటిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పాటు పడుతుందన్నారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి జీవో నెం.58 ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తునట్టు అదే విధంగా కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తు ్తనట్టు తెలిపారు. ఇంకా అనేకమంది ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారు ఈనెల 31లోపు జీవో నం బర్ 58 ద్వారా ధరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చందర్, ఎమ్మార్వో రాజకుమార్, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు, డివిజన్ అధ్యక్షులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.