Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ గద్దల సుకుమార్
నవతెలంగాణ-పరకాల
దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టాను ప్రజల ముందు బహిరంగపరిచి వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ గద్దల సుకుమార్ అన్నారు .సోమవారం పట్టణంలోని స్థానిక తహసిల్దార్ కార్యాల యం ముందు ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బొచ్చు అనంతు ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ గద్దల సుకుమార్ పాల్గొని నిరసన దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వా రు మాట్లాడుతూ దళితబంధు పథకంలో రూ.2 లక్షల నుండి రూ.3లక్షలు ఎమ్మెల్యే లు తీసుకున్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల చిట్టాను ప్రజల ముందు బహిరంగపరచాలన్నారు. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా ఇప్ప టివరకు బహిరంగ పరచకపోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అవినీతి కి పాల్పడుతున్న ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ నాయకులను సీఎం ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయకపోతే ఈ నెల 10న ఎమ్మార్పీఎస్ జాతీయ కన్వీనర్ మందకష్ణ ఆధ్వర్యంలో వేలాది మందితో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సుబ్బయ్య ,రవికుమార్, కిరణ్, రాహుల్ ,నగేష్ ,విజరు ,ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
10న కలెక్టరేట్ ముట్టడి
దామెర : దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడినట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగిందని అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే చిట్టాలను బయటపెట్టి అవినీతికి పాడుపడిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో క్రిమినల్ కేసులు పెట్టాలని తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించాలని తిరిగి రాబోయే ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వకుండా ఉండాలని మే 10న జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని దామెర మండల అధ్యక్షుడు గోవిందు రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పరిమళ మాదిగ, సుబ్బన్న, జైపాల్ మాదిగ, కిరణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.