Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పి జె సురేందర్‌రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె సురేందర్ రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ప్రజాదివాస్ నిర్వహించి ప్రజల నుండి 20 ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజల సమస్యలు పోలీసులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు తగు న్యాయం చేయాలన్నారు. అలాగే పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రజలు అనుమానస్పద వ్యక్తులు, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు.