Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బుర్రకాయల గూడెంలో ఓడి సి ఎం ఎస్. కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నారగాని దేవేందర్ గౌడ్, కాలియా రజిత బాబు, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్గౌడ్, మంద అశోక్ రెడ్డి, నాయకులు మోతే కరుణాకర్ రెడ్డి, వడ్లకొండ నారాయణ గౌడ్, గుజ్జ గంగాధర్ రావు, బోయిని సాంబయ్య, పబ్బ రవీందర్ గౌడ్, ముప్పిడి శంకర్, సునీత, ఉమా, తదితరులు పాల్గొన్నారు.