Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-చిట్యాల
గ్రామాల అభివద్ధి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జూకల్ గ్రామంలో 60 లక్షల రూపాయలతో చేపడుతున్న పలు అభివద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామంలో 30 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నేతత్వంలో ప్రతి గ్రామాన్ని అన్ని హంగులతో అభివద్ధి పరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జూకల్ గ్రామంలో మన ఊరు మనబడిలో భాగంగా పాఠశాలను మౌలిక వసతులు అదనపు తరగతి గదులతో సంపూర్ణంగా అభివద్ధి చేయడం జరిగిందని తెలిపారు. నేడు గ్రామంలో 30 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ప్రారంభించామన్నారు. 20 లక్షల రూపాయలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. గ్రామంలో పది లక్షల రూపాయలతో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశామన్నారు. జూకల్ గ్రామంలో అనేక అభివద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు అంతర్గత సీసీ రోడ్లు పాఠశాలకు అదనపు గదులు సైన్స్ ల్యాబ్ రైతు వేదిక అనేక అభివద్ధి కార్యక్రమాలతో గ్రామం అభివద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరాలు తెలుసుకొని వారికి అనువుగా ఉండే అభివద్ధి కార్యక్రమాల పనులను చేపడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల అభివద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజలంతా రుణపడి ఉండాలని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ నూతన భవనం కోసం స్థలాన్ని కొని దానం చేసిన దాతల్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ప్రజలు ముందుకు రావాలని తమ గ్రామాన్ని తామే అభివద్ధి చేసుకొని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుట్టపాక మహేందర్, ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జెడ్పిటిసి గొర్రె సాగర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆరేపల్లి మల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్రావు, పిఏసిఎస్ డైరెక్టర్లు పోరెడ్డి సుదర్శన్ రెడ్డి, మహేందర్, ఎంపీటీసీ జంబుల తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.