Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొర్రూరు ఆర్డీవో రమేష్
నవతెలంగాణ-పెద్దవంగర
రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ధాన్యం సేకర ణ పూర్తి చేయాలని తొర్రూరు ఆర్డీవో రమేష్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అవుతాపురం, పోచం పల్లి, గంట్లకుంట, వడ్డెకొత్తపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్ రమేష్ బాబు, మండల వ్యవసాయ అధికారి కుమార్ యాదవ్ తో కలిసి సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించి, ధాన్యం తరలింపు ఏర్పాట్ల పై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రైతుల కోసం ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతాంగం సద్వినియోగం చేసుకోవా లన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే రైతులు తాలు, మట్టిగడ్డ లు లేకుండా నిబంధనల ప్రకారం వరిధాన్యాన్ని తరలించాలని తెలిపారు. ధా న్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఆరుగా లం కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లుల్లో ధాన్యం దిగుమతి వేగంగా జరిగేలా హమాలీల సంఖ్య పెంచాలని అధికారులకు సూచించారు. కార్యక్ర మంలో ఏపీఎం నరేంద్ర కుమార్, సర్పంచులు చింతల భాస్కర్, నెమరుగొమ్ము ల ప్రవీణ్ రావు, ధాన్యం కొనుగోలు నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.