Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో స్వీకరిస్తున్న ధరకాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలిం చి పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంభందిత జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణిలో జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారా ణి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌కుమార్ ఇట్టి దరఖాస్తులను స్వీకరించి, వివిధ శాఖల జిల్లా అధి కారులను వీటిపై వెంటనే స్పందించి, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ ప్రజావాణిలో మొత్తం 97 దరఖాస్తులు వచ్చాయని తెలియ జేశారు. శాఖల వారిగా టు బీహెచ్‌కే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్-5, ఏసీపీ హనుమ కొండ-3, ఏడిల్యాండ్ రికార్డ్-3, కమిషనర్ జీడబ్ల్యూఎంసీ-9 తదితరులు శాఖల నుంచి వచ్చాయి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సాంబశివరావు, డిపివో జగదీశ్వర్, ఎస్సి కార్పొరేషన్ ఈడీ మాధవిలత పాల్గొన్నారు.