Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
ప్రభుత్వం రైతులు పండిం చిన మొక్కజొన్న పంట లకు గిట్టబాటు ధర కల్పించడం కోసం ప్రత్యామ్నాయంగా మక్క ల కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయడం జరిగిందని ఆ దిశ లో రైతులు పూర్తిస్థాయిలో సద్వి నియోగం చేసుకోవాలని డిఆర్డిఏ పిడి సంపత్ రావు తెలిపారు.మండలం లోని మాల్య తండాలో సూర్యోదయ మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలుకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పి డి సంపత్ రావు మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచి శుభ్రంగా ఉన్న మక్కలను తీసుకు రావాలన్నారు. 14 శాతం తేమ ఉన్న మక్కలను తీసుకొని రావాలి రావాలి అని కేంద్ర నిర్వాహకులకు సహకరిస్తూ రైతులు లబ్ది పొందాలని సరియైన డాక్యుమెంట్ సమర్పించిన వారం రోజుల లోపు రైతు ఖాతాలో డబ్బులు పడతాయని మద్దతు ధర 1962 రూపాయలు ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడ సుజాత ఈర్యా నాయక్, ఎంపీటీసీ భాస్కర్,డి పి ఎం సరిత, ఏపీఎం తోటకూరి కష్ణమూర్తి, సీసీలు రవీందర్ రాజు, సుధాకర్, కాంతయ్య, సూర్యోదయ ఎఫ్ పి సి చైర్మన్ కవిత, వైస్ చైర్మన్ సరిత వి ఓ ఏ లు రమేష్, యాకస్వామి,మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని ముస్త్యాలపల్లిలో ఐకేపీ మారుతీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బొట్ల సంధ్యరవి ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీ గింజని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులని నమ్మి మోసపోకుండా ధాన్యాన్ని కల్లాల వద్దే అరబోసుకొని తేమ శాతం లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మధ్ధతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెజ్జంకి రఘునాచారి, వార్డ్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు బొట్ల లావణ్యరాజేందర్, తిప్పారపు వీరేశం, బిఅర్ఎస్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి దేవనాడి సాంబశివ రావు, కుమారస్వామి, సిఏ విమల, విఓ అధ్యక్షురాలు బొట్ల రజిత, బాధారగాని పద్మ, బిఅర్ఎస్ నాయకులు, మహిళ సంఘం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.