Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
మైనారిటీలకు కేసీఆర్ బాసటగా నిలిచారని షాది ముబారక్ చెక్కులు అంది స్తుండడంతో మైనారిటీ ఇండ్లలో పండుగ వాతావరణం నెలకొందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నియోజకవర్గానికి చెందిన 100మందికి షాధిముబారక్ చెక్కులను 21వ డివిజన్ తాజ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఎమ్మె ల్యే నన్నపునేని లబ్ధిదారులకు చెక్కుల పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి పెద్దన్న కేసీఆర్ అందిస్తున్న సాయం షాధిముబారక్ అని, ఆడబిడ్డ పెళ్లిళ్లు పేదింట్ల భారం కావద్దని పెద్దమనసుతో కేసీఆర్ షాధిముబారక్ అందిస్తున్నారని గుర్తుచేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివద్ధిలో ముందుంచడమే తన మొదటి ఎజెండా అని అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీ ఆర్తో చర్చించి నూతన బస్ స్టేషన్, కలెక్టరేట్,మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లా కేంద్రంతో పాటు మరెన్నో అభివద్ధి పనులు చేస్తున్నామన్నారు. మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు వె చ్చించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియో జకవర్గ కార్పొరేటర్లు మహమ్మద్ ఫురాన్,సురేష్ జోషి,బాలిన సురేష్,ఆకుతోట తేజస్వి శిరీష్, ఓని భాస్కర్,23వ డివిజన్ ఇంచార్జ్ మాజీ కార్పొరేటర్ యెలగం సత్యనారాయణ, 22వ డివిజన్ ఇంచార్జ్ మావూరపు గీత విజరు భాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, ముస్లిం పెద్దలు,మైనారిటీ నాయకులు,ముఖ్య నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.