Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషన్ సభ్యులు సయ్యద్ షహజాది సమీక్ష
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను పటి ష్టంగా అమలు పరచాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షహ జాది అధికారులను ఆదేశించారు.బుధవారం ఐడిఓసిలోని సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమంలో భాగంగా కలెక్టర్ శశాంక,ఎస్పీ శరత్ చంద్ర పవర్ అధ్యక్షతన జిల్లాలో అమలుపరుస్తున్న పలు సంక్షేమ పథకాలను 15 అంశాలలో సమగ్రంగా సమీక్షించారు. ముందుగా అంగన్వాడి కార్యకలాపాలను వివరంగా అడిగి తెలుసు కున్నారు. కంకర్ బోర్డులో మైనారిటీ ప్రజల అధికంగా ఉన్నందున రెండు కేంద్రాల ను పట్టిష్టంగా నిర్వహించాలన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియంలో మైనారిటీ పాఠశాలలు, వసతుల వివరాలు ఇవ్వాలని డిఈవోను ఆదేశించారు. నిరుపేద మైనారిటీల అభివృద్ధికై ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలన్నారు.మెప్మా ఆధ్వర్యంలో మైనారిటీ మహిళలచే మహబూబాబాద్ డోర్నకల్ మండల కేం ద్రాలలో నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు వివరించగా వ్యాపా రాలలో రాణించే విధంగా వారి సాధికారిక దిశలో కొన సాగేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. జిల్లాలో భూగర్భ జలాలు పెరిగేందుకు చేపట్టిన కార్యక్రమం లో నిరుపేద మైనారిటీలు పాల్గొంటున్నారని, 140 కోట్ల పనులు చేపట్టడం జరి గిందని, 8 లక్షల రోజులు పనులు చేపట్టి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. జిల్లా యువజన క్రీడల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించే వివ రాలను అడిగి తెలుసుకుంటూ ప్రతీ సంవత్సరం ఇండియా క్రీడలు జరుగుతాయ ని హర్యానా జబల్పూర్లలో నిర్వహించినందున మహబూబాబాద్ జిల్లాలో కూడా క్రీడల నిర్వహణకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.కార్మికశాఖ ఆధ్వర్యంలో చేప డుతున్న ఈ శ్రమ్ పథకం ప్రతీ ఒక్కరికి అమలు పరచాలన్నారు. స్కాలర్షిప్ వివ రాలు అడిగి తెలుసుకున్నారు.ఒక కోటి పది లక్షలు 18 మందికి ముద్ర లోన్స్ ఇవ్వ డం జరిగిందని వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున 481 మంది మై నార్టీలకు రుణాలు ఇవ్వడం జరిగిందని జిల్లా లీడ్ బ్యాంక్ వివరించగా ప్రతి ఒక్క మైనారిటీ నిరుపేదలకు రుణమందేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. జి ల్లాలో షాదీ ముబారక్ పథకం కింద మహబూబాబాద్ డివిజన్లో 124 మంది తొర్రూరు డివిజన్లో 67 మంది లబ్ధి పొందినట్లు తెలిపారు. రంజాన్ పండుగకు ప్రభుత్వం అందజేసిన గిఫ్ట్ప్యాక్లు ఇఫ్తార్ నిర్వహణకు మంజూరు చేసిన నిధుల తో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అంతకుముందు జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలుకు కలెక్టర్ ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డివోలు కొమరయ్య, రమేష్, డిఆర్డిఏ పిడి సన్యాసయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.