Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ఆకాల వర్షంతో పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపా యలు నష్టం పరిహారాన్ని చెల్లించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం 10 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షులు జడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు వడగండ్ల వానల వలన పంటలు నష్టపోయిన రైతుల పొలాలను ఏఐకేఎంఎస్ బృందం బుధవారం మండలంలోని మద్దివంచ, రాంపురం, కొత్తతం డా, గార్ల, గోపాలపురం గ్రామాలలో క్షేత్రస్దాయిలో పరిశీలించారు. ఈ సందర్భం గా సత్యనారాయణ మాట్లాడారు. యాసంగి పంటలుగా వేసిన వరి, మొక్కజొన్న, వానాకాలం పంటలుగా పండించిన మిర్చి,పత్తి పంటలను రైతులు వేల రూపా యలు అప్పులు తెచ్చి సేద్యం చేయగా పంట చేతికొచ్చే దశలో అకాల వడగండ్ల వానలకు పంటలు దెబ్బతిన్నాయాని ఆవేదన వెలిబుచ్చారు. సీఎం కేసీఆర్ రైతు లను ఆదుకుంటామని నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని పంటలకు నష్టం జరిగిందని తేల్చడానికి 33 సర్వేలు చేస్తున్నారని మండిపడ్డారు. నష్ట పరిహారంతో పాటు తీసుకున్న రు ణాలు రద్దు చేసి సమగ్ర పంటల భీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుసిని బాబురావు, నాయకులు జి.శంకర్, గోసు బజారయ్య, డి.రవి, జి.మల్లేష్, శ్రీరాములు, మైబెల్లి పాల్గొన్నారు.