Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూ డెమోక్రసీ నాయకులు మండల వెంకన్న
నవతెలంగాణ-మహబూబాబాద్
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మహబూబాబాద్ టౌన్ కమిటి సభ్యులు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా సహయ కార్యదర్శి హలవత్ సునీత ఆశయా లను కొనసాగించాలని న్యూ డెమోక్రసీ అనుబంద అఖిల భారత రైతు కూలీ సం ఘం రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న అన్నారు. సునీత ప్రథమ వర్ధంతి సభ బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని గంగపుత్ర భవన్లో తెల్లబోయిన లక్ష్మ య్య అధ్యక్షతన జరిగింది. ఈ సభలో అభిల భారత రైతు కూలీ సంఘం ఏఐ కేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ సునీత చిన్న తనం నుంచే విప్లవ భావాలకు ఆకర్షితురాలై పూర్తికాలం కార్యకర్త ఎదిగిందని, తన శ్రావ్యమైన గొంతుతో విప్లవ గేయాలు ఆలపించేదని తెలంగాణ ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం చురుకైనా పాత్ర పోషించిందని సునీత లేని లోటు తీర్చ లేనిదని, సునీత ఆశయ సాధన కొరకు మనం శక్తివంచన లేకుండా పాటు పడాల ని పిలుపునిచ్చారు. టిపిటిఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ మాట్లాడు తూ సునిత కటిక పేదరికం నుండి వచ్చిన సునీత విప్లవద్యమంలో ఓనమాలు నేర్చుకున్నాదని, ఎంతో పరిపక్వత సాదించదని, ప్రగతిశీల మహిళా సంఘంలో జిల్లా సహాయ కార్యదర్శి స్థాయికి చేరుకున్నాదని, ఎంతో మందికి స్ఫూర్తి నిస్తూ తన భావాలను ఇతరులకు పంచిందని, ప్రతీ మహిళా సునినీతలాగా పట్టుదలతో ముందుకు రావాలని కోరారు. ఈ వర్ధంతి సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి అనసూర్య, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సక్రు, నందగిరి వెంకటేశ్వర్లు, పర్వత కోటేష్ , హాల వత్ లింగన్న ఎస్కే బాబన్న, తిరుపతమ్మ, ఆలకుంట్ల సాయిలు, దేశే రామచంద్ర య్య, సీపీఎం నాయకులు రామూర్తి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బానో త్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.