Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూని యర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యం లో బుధవారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు, సీఐటీయూ తది తర యూనియన్లు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా వివి ధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ జూనియర్ పంచా యతీ కార్యదర్శుల న్యాయమైన హక్కుల కోసం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం నిరసన తెలుపుతున్నారని చెప్పారు. నిరసన తెలుపుతున్న ఉద్యోగులతో చర్చలకు రాకుండా ప్ర భుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. జూ నియర్ కార్యదర్శుల నియామక పత్రాల ప్రకారం మూడు సంవత్సరాల ప్రొబేషనరి ఇచ్చి, దాన్ని చట్టవిరుద్ధంగా నా లుగు సంవత్సరాలకు పెంచి, నాలుగు సంవత్సరాల కాలప రిమితి పూరైన తర్వాత కూడా వారి ఉద్యోగాలను క్రమబద్ధీ కరించకపోవడం, జాతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి అ వార్డులు రావడానికి అహర్నిశలు పాలుపడ్డ జేపిఎస్లను రోడ్డు మీద నిలబెట్టడం, మీ ఉద్యోగాలు పోతాయి అని బెది రించడం ఈ ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిదర్శనంగా పే ర్కొన్నారు. తక్షణమే వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పే స్కేలు పెంచి ఉద్యోగాలకు తీసుకోవల్సిన బాధ్యత ఈ ప్రభు త్వంపై ఉందని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేప డతామని హెచ్చరించారు. మద్దతు తెలిపిన వారిలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బేజారి బీరప్ప,అసెంబ్లీ కన్వీనర్ బల్ల శ్రీని వాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్ యువమో ర్చా అధ్యక్షులు మైపాల్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ నవీన్ కుమార్, జిల్లా కా ర్యవర్గ సభ్యులు అనిల్ గౌడ్, మాదిగ స్టూడెంట్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిధి రాగల ఉపేందర్, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కన్వీనర్ గుర్రం సామ్సంగ్, విహెచ్పిఎస్ జిల్లా ఉ పాధ్యక్షులు చక్రపాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పత్తిని అశోక్, వ్యవసాయ కార్మిక కర్షక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారం రమేష్ తదితరులు ఉన్నారు.
దేవరుప్పుల : జేపీఎస్‌ల డిమాండ్ కోసం చేస్తున్న నిర వధిక సమ్మె మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో బుధవారం 13వ రోజుకు చేరుకుంది. జేపీఎస్‌ల న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలని మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సింగారపు రమేష్, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకన్న, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా నాయకులు గుర్రం శాంసన్, తమ్మెల రవీందర్, రవి, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పైసా రాజశేఖర్, విక లాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు చక్ర పాణి, బీజేపీఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప మద్దతు తెలిపారు.
నెల్లికుదురు : రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న వేలాదిమంది పంచాయతీ కార్యదర్శులను విధుల్లో చేరకపోతే సస్పెండ్ చేస్తామని బెదిరించడం రా జ్యాంగ విరుద్ధమని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా నెల్లికుదు రు, నర్సింహులపేట, చిన్నగూడూర్ సంయుక్త మండలాల కార్యదర్శి ఇరుగు అనిల్ అన్నారు. బుధవారం స్థానిక వి శ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు, ప్రభుత్వానికి సేవ లందిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వ ని బంధనల ప్రకారం ఎందుకు పూర్తిస్థాయి ఉద్యోగులుగా గు ర్తించడం లేదన్నారు. సాధారణంగా రెండు సంవత్సరాలకు ప్రొబిషన్ పీరియడ్ పూర్తయి పూర్తిస్థాయి ఉద్యోగిగా గుర్తిం చాలని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంగించడం సరికా దన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యోగుల ఆకాంక్షలకు వ్యతిరే కంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా నియంతృత్వ విధానాలు అమలు చేయడం మంచిది కాద న్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులనుసైతం నేటి పాల కులు కాలరాస్తూ ఏస్మాలాంటి దుర్మార్గపు చట్టాలను ప్రయో గిస్తామనటం తెలంగాణ ప్రజల, ఉద్యోగుల, అమరవీరుల ఆశయాలకు విరుద్ధమన్నారు. యుద్ధ ప్రాతిపదికన పంచా యతీ కార్యదర్శుల డిమాండ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్ర భుత్వం పూనుకోవాలని అనిల్ కోరారు. పంచాయతీ కార్య దర్శులు, విఏఓలు, గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న ఆం దోళనలకు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ సంపూర్ణ మద్ద తును ఇస్తుందన్నారు. ఈ సమావేశంలో ప్రజాపంథా డివిజ న్ నాయకులు పల్లెల పాపారావు, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయ కులు చదల ప్రశాంత్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : జేపీఎస్‌లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీపీఎం మండల కార్యదర్శి ఎండి యాకూబ్, సీఐటీయూ జిల్లా నాయకులు మార్క సాంబయ్యలు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఎం, సీఐటీయూ, రజక సంఘాల ఆధ్వ ర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఉద్యమాలతోనే ప్రతీదీ సాధించుకోగలుగుతామ ని, రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడి ఎవరు విధులకు హాజరు కావద్దని, మీ ఉద్యమానికి ఎల్లవేళలా సీపీఎం పార్టీ, సీఐటీయూ కార్మిక సంఘం, రజక సంఘాలు అండగా ఉం టాయన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆనాడు ఉద్యమం చేస్తే తప్పులేదు కానీ ఈనాడు తమ హక్కుల కో సం పంచాయతీ కార్యదర్శులు ఉద్యమాలు చేస్తే భయపెట్టి విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు తొలగిస్తామని భయభ్రాంతు లకు గురి చేయడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం అని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు అందరూ రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా అందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు కార్మిక హ క్కులను కాలరాస్తూ యూనియన్లే వద్దనే నెపంతో ఔట్సో ర్సింగ్, కాంటాక్ట్ బేసిక్ ఉద్యోగులను యూనియన్లు కడితే తొలగిస్తామని బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు. నియంత పాలన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆగడా లను అరికట్టే విధంగా కార్మికులు, కర్షకులు, ప్రజలు సంఘ టితమై గత ప్రభుత్వాలకు పట్టించిన గతే పట్టించే రోజులు వచ్చాయన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం స్పందించి జేపీఎస్‌లను ఉద్యోగులుగా గుర్తించి వారిన్యాయమైన డి మాండ్లను నెరవేర్చాలని లేనియెడల అన్ని కార్మిక సంఘాల ను, ప్రజాసంఘాలను కలుపుకొని పంచాయతీ కార్యదర్శు లకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహి స్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా కన్వీనర్ పున్నం సారయ్య, సీఐటీయూ నాయకులు తిమ్మిడి రవి, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్య క్షుడు కొండ రాము, తదితరులు పాల్గొన్నారు.