Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విడుదలైన ఇంట ర్ మీడియట్ పరీక్ష ఫలితాలలో శివనగర్ ప్రాంతా నికి చెందిన బండి రిషిత ఉర్సు గుట్ట మహాత్మా జ్యోతి రావు పూలే ప్రభుత్వ గురుకులంలో ఇంటర్ విద్యను అభ్యసిస్తు బైపీసీలో 435 మార్కులు సాధించి రా ష్ట్రంలో నాలుగవ స్థానం లో నిలిచింది ఆమె ప్రతిభ కు మెచ్చి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేం దర్ బుధవారం ఆయన క్యాంపు ఆఫీసుకు పిలిపిం చుకొని విద్యార్థినినీ ఘనంగా సన్మానించి అభినందన లతో పాటు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల పాటశాల,కలశాలలు ఉత్తమ ప్రతిభను కనబరిచడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు పని చే స్తున్నాయని అన్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంలోని ఉర్సు గుట్టనున్న మహాత్మా జ్యోతి రావు పూలే ఇంటర్ విద్యార్థులు అద్భుత ఫలితాలను సా ధించారని ఆన్న ఆయనఇంటర్ బైపిసి మొదటి సం వత్సరం విద్యార్థిని బండిరిశీత 435/440 మార్కులు సాధించి రాష్ట్రంలో 4వ ర్యాంక్ సాధించి ఓరుగల్లు నగరానికివన్నె తెచ్చిందని అన్నారు. జ్యోతి రావు పూ లే కళాశాల, నియోజకవర్గ గురుకులాల్లో అద్భుత మైన ఫలితాలు సాధించారని విద్యార్థుకు ఇదే ఉత్సా హంతో మరింత గొప్పగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతి రావు పూలే పాటశాల ప్రిన్సిపాల్ అంజిరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు.