Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
గత మార్చి నెలలో కురిసిన అకాల వడగళ్ల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతు లకు ఎకరానికి రూ.10 వేలు తక్షణమే అందిస్తామని వరంగల్ పర్యటించిన సం దర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించి నెలన్నర దాటుతున్నా ఇంతవరకు అమల్లోకి రాలేదని వెంటనే రైతులఖాతాలో నగదు జమచేయాలని బుధవారం అఖిల భార త రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకలెక్టరేట్ ఎదుట సంఘం నా యకులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీవత్స కోటని కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. జిల్లాలో అకాల వర్షాలకు మొక్కజొన్న, వరి,మిర్చి, పత్తి తోటలు కూడా దెబ్బతిన్నాయన్నారు. ప్రకతి విపత్తు వల్ల జరిగే ఇలాంటి నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన సమాధానం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని గత మూ డేళ్లుగారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పైగా ఎకరానికి రూ.5వేలు రై తుబంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పు కుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎక రానికి రూ.30 వేల నుండి రూ.50 వేల వరకు నష్టం రైతులకు జరిగిందని దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని వారు ప్రశ్నించారు.
వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశా రు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఏ పంట ఎంత విస్తీర్ణంలో పండిందో సమగ్రమైన నివేదికలు వారివద్ద లేవని సంఘం నాయకులు అన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కాంటాలు పెట్టడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు టోకెన్లు ఇవ్వకపోవడంతో కొనుగోళ్లు జరగడం లేదన్నారు. సెంటర్ల నిర్వహకులు మాచర్ రావడం లేదని రైతులను మరింత ఇబ్బం దులకు గురి చేస్తున్నాని విమర్శించారు. వెంటనే చర్యలు తీసు కోవాలని జిల్లా కలెక్టర్‌ను వారు కోరారు.
గత ఏప్రిల్ 27న జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో వర్షాలకు వరి ధాన్యం తడిసి మొలకలు వచ్చి వరిమండేలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యంకాపాడుకోవడానికి టార్ఫాలిన్లు కూడా ఇవ్వలే దు. అధికారుల మాటలు నీటి మీద గీతలయ్యాయి ఇంత జరుగుతున్న అధికా రులు గ్రామాల్లో, పర్యటించడం లేదు. ఆరబోసిన వరి ధాన్యం కాపాడు కొనుటకు ప్రతీ కొనుగోలు కేంద్రంకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.40 ఏళ్లు పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అనేక కొర్రీలు పెడుతున్నది 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి రైతు కుటుంబానికి 10 ఎకరాల పట్టా ఇవ్వాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆబర్ల రాజన్న, ప్రధాన కార్యదర్శి మొగిలి, ప్రతాపరెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు, జిల్లా నాయకులు గట్టి కష్ణ, భోగిసారం గపాణి, బండి కోటేశ్వరరావు, ఇనుముల కష్ణ, భద్రాజి, ఎండి అక్బర్, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఆరేల్లి కష్ణ పాల్గొన్నారు.