Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం
- అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు
- తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
నవతెలంగాణ-కాశిబుగ్గ
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్, బిజెపి లతో సహా బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి లేదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేం దర్ అన్నారు. బుధవారం 20వ డివిజన్లో రూ.2. 60 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేందర్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక కా ర్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ అధ్యక్షతన జరి గిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీ ఆర్ తూర్పునియోజకవర్గంపై ప్రత్యేక దృష్టితో రూ. 3,800 కోట్లు కోట్లు కేటాయించడం వల్ల గొప్పగా అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. అహర్నిశలు శ్రమించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆజంజాహి మిల్స్‌కి తెచ్చామని, రూ.1100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని,రూ.75 కోట్ల తో నూతన బస్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. తూ ర్పు నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అభివృ ద్ధి చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలకులు కార్మికుల ను ప్రజలను తమ అవసరాలకు వాడుకున్నారే తప్ప వారి ఎదుగుదలకు ఏమాత్రం సహకరించలేదన్నా రు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తప్పనిసరి గా తగినగుర్తింపు ఉంటుందని హామీఇచ్చారు. 20వ డివిజన్ ను కనివిని ఎరుగని రీతిలో అభివద్ధిపరిచి, ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతానన్నారు.
ప్రజల అభ్యున్నతి, నియోజకవర్గ అభివద్ధి ధ్యే యంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని అందుకే జి ల్లాలోనే తూర్పనియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి అద్భుత ప్రగతి సాధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం డివిజన్ లోని పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, డివిజన్ ఇంచార్జి దుబ్బశ్రీనివాస్, నాయకులు సంతోష్, సోను, సారంగపాణి, పండు, గజ్జి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.