Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, 'నవతెలంగాణ' పత్రిక రాష్ట్ర ఇంచార్జ్ చెరుకుపల్లి సీతారాములు
నవతెలంగాణ-హనుమకొండ
సమాజంలోని పేదప్రజల సమస్యలపై నిరం తరం పోరాడుతూ గుడిసెవాసులకు వెన్నుదన్నుగా ఉంటున్న పత్రిక 'నవతెలంగాణ' మాత్రమేనని పేద ప్రజల గొంతుకైనా ఈ పత్రికను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు, 'నవతెలం గాణ' పత్రిక రాష్ట్ర ఇంచార్జ్ చెరుకుపల్లి సీతారాము లు పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ నక్క లగుట్టలోని హరిత కాకతీయ హోటల్ కన్వెన్షన్ హా ల్లో సీపీఎం పార్టీ హనుమకొండ జిల్లా విస్తతస్థాయి సమావేశం (వర్క్‌షాప్) జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి స భా ధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన సీతా రా ములు మాట్లాడుతూ ఈనె ల 11 నుండి 31 వరకు 'నవతెలంగాణ' పత్రిక స ర్క్యులేషన్ పెంచడానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టా మని పత్రిక సర్క్యులేషన్ పెంచాలని కాబట్టి ఈ కా ర్యక్రమాన్ని పార్టీ, పత్రిక ఉ ద్యోగులు విలేకరులు సహ కరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కరోనా కాలంలో ఒకదశలో 'నవతెలంగాణ' పత్రికచాలా క్లిష్ట పరిస్థితు లు ఎదుర్కొందని ఈ పరిస్థితిని పత్రిక ఉద్యోగులు, పార్టీ నాయకులు, విలేకరులు అందరు కలిసి సమిష్టి కృషితో ప్రస్తుతం పత్రిక విజయవంతంగా నడిపించ డం జరుగుతుందని కొనియాడారు. ప్రధానంగా మ రో ఆరునెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయని ఈ ఎన్ని కల్లో ప్రధానంగా మనఎజెండా బీజేపీని గద్దె దింపేం దుకు సిద్ధంగా ఉండాలని బిజెపి మత పిచ్చి లేపి మ ళ్లీ అధికారంలోకి రావడానికి సర్వశక్తులు వండుతోం దని కానీ ప్రతిరాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బలోపే తంగా ఉన్నాయని ఎన్నికల ముందు ఎలాంటి కూట ములు ఏర్పడకుండా ఎన్నికల తర్వాత మోడీకి వ్యతిరే కంగా కూటమి ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో మనతెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఓడించే సత్తా బీఆర్ఎస్కు ఉందని ఆ కార ణంతోనే సిపిఐ, సిపిఎం పార్టీలు ఆ పార్టీకి మద్దతిస్తు న్నాయని అన్నారు. గత 9ఏళ్లుగా పరిపాలిస్తున్న బీజేపీ పేదలపాలిట శాపమైందని సామాన్య మానవు నికి అందనంత ఎత్తులో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన డీజిల్, పెట్రోల్,గ్యాస్ ధరలతో పేదప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇదేమిపట్టన ట్లు కేవలం మతంపేరుతో ఓట్లు దండుకోవాలని చూ స్తుందని ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మళ్లీ రా కుండా పార్టీల కతీతంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.
వాసుదేవారెడ్డి మాట్లాడుతూ దాదాపు మీడియా కార్పోరేట్ కబంధహస్తాల్లో ఉందని కేవలం కార్మిక పే ద బడుగు, బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేది 'నవతెలంగాణ' మాత్రమే అ న్నారు. కాబట్టి నవతెలంగాణ పత్రికను ప్రతి ఒక్కరు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పార్టీ తెలంగాణ బొట్ల చక్రపాణి మాట్లాడుతూ పత్రిక సర్క్యులేషన్ పెంచడానికి మండలాల వారీగాకమిటీలు పూర్తి బా ధ్యత తీసుకుని అనుకున్న లక్ష్యం సాధించాలని కోరా రు. ఈ సమావేశంలో 'నవతెలంగాణ' పత్రిక జిల్లా మేనేజర్ దేవేందర్‌రావు, బ్యూరో బొక్క దయాసాగర్, ఎం.చుక్కయ్య, జీ.ప్రభాకర్‌రెడ్డి, టీ.ఉప్పలయ్య, వాం కుడత్ వీరన్న, రాగులరమేష్, గొడుగు వెంకట్, మం ద సంపత్, దొగ్గల తిరుపతి, హనుమకొండ జిల్లా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.