Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామంలో మార్పు రావాలన్నదే మా ఆరాటం
- సర్పంచ్ శ్రీపతిబాపు
నవతెలంగాణ-మహాదేవపూర్
మహాదేవపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛ గ్రామం పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చేందుకు విన్నూత్న కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతుంది. ప్రజల్లో మార్పు రావాలని,గ్రామంలో మార్పు రావాలని కోరుకొని తానొక సర్పంచ్ లా కాకుండా సమాజ తత్వవేత్తలా ప్రజల వద్దకే వెళ్లి ఊరు వాడ శుభ్రం చేయడం గొప సేవాకార్యం అని మా ఆరాటం,పోరాటం ప్రజల మేలుకోసమేనని సర్పంచ్ శ్రీపతిబాబు అన్నారు. గ్రామాన్ని శుభ్రం చేయడానికి కష్టపడుతుంటే, శుభ్రం చేసిన వాడల్లో రోడ్లపై చెత్త వేస్తున్నారని,ఇదంతా చేసేది ఎందుకో ఆలోచించాలని అన్నారు. పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధితో కషి చేస్తున్నామని అన్నారు. ఊర్లో ఇంటి నుండే నేరుగా చెత్త బుట్టలతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్, బొలెరో వాహనం ద్వారా చెత్త ను సేకరిస్తున్నామన్నారు.అయినా ప్రజల్లో మార్పు రావడం లేదని అన్నారు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలన్నదే మా ఆశ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పర్శవెన మధు, తుమ్మ సందీప్,కాలనీ వాసులు,పారిశుధ్య కార్మికులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.