Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ వెంకటేశ్వరరావు
నవతెలంగాణ -తాడ్వాయి
మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ చవళ్ళ వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం గంగారం గ్రామ పంచాయతీ పరిది అన్నారం, గుత్తికోయగూడెంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఉదయమే గుత్తి కోయ గూడెం వెళ్లి సోదాలు నిర్వహించారు. అందరిని ఒకే వద్దకు పిలిచి, సమా వేశపరిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో అపరిచితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మావోయిస్టు భావజాలం వైపు యువతను ప్రేరేపించాలని చూసిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గుడుంబా అమ్మిన తయారుచేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని అన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న చట్టరీత్య శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటాచ్డ్ ఎస్ఐ శ్రావణ్ కుమార్, సివిల్ సిఆర్పిఎఫ్, సివిల్ పోలీస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.