Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతి సెక్రటరీలను న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి తక్షణ మే సమ్మెను విరమింపజేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కా ర్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. గురు వారం డివైఎఫ్ఐ ములుగు జిల్లా కమిటీ సమావేశం మం డలంలోని పస్రా గ్రామంలో జరిగింది. ముఖ్యాతిథిగా హజరైన వెంకటేష్ మాట్లాడుతూ రెండువారాలుగా నిర వధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రట రీలకు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీల సకల సేవలను ఉపయోగించుకుంటుందన్నారు.ముగిసిన ప్రొబిషన్ పిరియడ్ ను దష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన జీవోకు కట్టుబడి వారిని క్రమబద్ధీకరించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మొదటగా మూడేళ్ల ప్రొ బిషన్ పిరియడ్ అని తర్వాత ముఖ్యమంత్రి మరో సం వత్సరకాలం పెంచి మొత్తం నాలుగు సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత కూడా క్రమబద్ధీకరణలో తా త్సారం చేయడం సరియైంది కాదన్నారు. చాలా రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం చర్చలకు పిలిచి బేషరతుగా సమ్మె విరమింపజేయాలని చెప్పారు. తక్షణమే చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్ల అన్నింటిని నెరవేర్చాలని కోరారు.పంచాయితీ కార్యదర్శు లను ప్రభుత్వం బెదిరించకుండా డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్,జిల్లా నాయకులు బి.సంజీవ,సిరిపల్లి జీవన్,జక్కు వేణ్, పిట్టలఅరుణ్, కందుల శ్రావణ్,తీగల సందీప్,మదాసు శ్రావణ్, పల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.