Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్య శర్మ
నవతెలంగాణ-పెద్దవంగర
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మండల అభివద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గొల్ల, కురుమలకు ప్రభుత్వం చేపడుతున్న రెండవ విడత గొర్రెల పంపిణీ విధి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా శర్మ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా యాదవుల అభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ చేసి వారి జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారని అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీకి అర్హులైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ డీడీ లు చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాలలో గొర్రెల పంపి ణీ ఉంటుందని, దానికి లబ్ధిదారులు సన్నద్ధం కావాలని తెలిపారు. యాదవ కుల స్తులు ప్రభుత్వం అందజేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు. అనంతరం పశువైద్యాధికారి రాజశేఖర్ లబ్దిదారుల సందేహాలకు సమాధానం ఇచ్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్నాయకులు శ్రీరామ్సుధీర్, పంచా యతీ కార్యదర్శి వెంకన్న, యాదవ నాయకులు నిమ్మల శ్రీనివాస్, కుమా రస్వామి, లింగయ్య, రాజేష్, మహేష్, పశు వైద్య సిబ్బంది ప్రభాకర్ సుమన్ పాల్గొన్నారు.