Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్ల జిల్లాకు లక్షా42వేల627 కేటాయింపు
- నేడు మున్సిపల్ కార్యాలయంలో పంపిణీ
నవతెలంగాణ-భూపాలపల్లి
బతుకమ్మ, దసరా పండుగకుగాను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు లక్షా42వేల627 చీరలను ప్రభుత్వం కేటాయించింది. 11మండలాల్లో తెల్ల రేషన్ కార్డు ఉండి 18ఏండ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయనున్నారు. భూపాలపల్లి మండలానికి 23,240, రేగొండ మండలానికి 22,450, గణపురం మండలానికి 13,109, చిట్యాల మండలానికి 13,614, టేకుమట్ల మండలానికి 9,885, మొగుళ్ళపల్లి మండలానికి 13,330, మహదేవ్పూర్ మండలానికి 11,689, కాటారం మండలానికి 13,123, మల్హర్రావు మండలానికి 10,059, మహాముత్తారం మండలానికి 9,593, పలిమెల మండలానికి 2,535 చీరలు కేటాయించారు. ఆయా గ్రామాల్లోని రేషన్ షాపుల ద్వారా ప్రజాప్రతినిధులు, వీఆర్ఓ, కార్యదర్శి, రేషన్‌డీలర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది కూడా చేనేత కార్మికులతో తయారు చేసిన చీరలు
పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగానే నేడు మున్సిపాలిటీ కార్యాలయంలో చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై పంపిణీ చేయనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : సుమతి, డీఆర్డీఓ, నోడల్ అధికారి
బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాల.ఆయా గ్రామాల్లో రేషన్ షాపుల్లో చీరలు ఆందుబాటులో ఉంటాయి. అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నాం.
ఆరు సెంటర్ల ద్వారా పంపిణీ : మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 10,500చీరలను ఆరు సెంటర్ల ద్వారా పంపిణీ చేయనున్నాం. ఇందులో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయం, జంగేడు, కాసీంపల్లి, బెడ్డలపల్లి, పుల్లూరిరామయ్యపల్లి, సుభాష్‌కాలనీలోని రేషన్ షాపులలో నిల్వ ఉంచాం. రేషన్ డీలర్‌తోపాటు మున్సిపల్‌శాఖ అధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేస్తాం.