Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం. హరిత జిల్లా విద్యా శాఖాధికారికి పంపిన హెచ్2/199 సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ కలెక్టర్‌పై మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సర్క్యులర్‌పై కలెక్టర్ తరుపున డీఆర్ఓ హరిసింగ్ సంతకం చేసినట్టు సమాచారం. ఏదేమైనా నోట్‌ఫైల్ సరిచూసుకోకపోవడం వల్ల జరిగిన తప్పిదంగా అధికారవర్గాలు భావిస్తున్నాయి. జనాభా లెక్కలకు సంబంధించిన ఈ సర్క్యులర్‌లో ఎన్పీఆర్ అనే పదాన్ని పేర్కొనడం వివాదానికి కారణంగా మారింది. సీఎం కేసీఆర్ ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన సర్క్యూలర్‌లో ఎన్పీఆర్ అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. ఎన్పీఆర్ అనే పదాన్నే ఈ సర్క్యులర్‌లో వాడొద్దని, అనవసరంగా ఈ పదాన్ని పేర్కొన్నారని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో ఈ సర్క్యులర్‌ను నిలిపివేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.