Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిలీ ప్రజలు కొత్త రాజ్యాంగ రచన చేయడానికి రాజ్యాంగ పరిష్యత్ కోసం 155 మంది సభ్యులను ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికుని చరిత్ర సృష్టించారు. నియంత పినోఛట్ కాలంలో రాసిన రాజ్యాంగం పెట్టుబడిదారీ సరళీకరణ విధానాలను కఠినంగా అమలు జరిపి, కార్పొరేట్ సంస్థలకు విపరీతమైన లాభాలు సమకూర్చిపెట్టే రాజ్యాంగం అది. దాన్ని మార్చడానికి ఈ ప్రక్రియ ప్రజల చొరవతో మొదలైంది. దాని పరాకాష్టే ఇటీవల ఆదేశ రాజ్యాంగ పరిషత్ ఎన్నిక కోసం జరిగిన ప్రక్రియ.
ఈ ఎన్నికలతో పాటు జరిగిన మేయర్ల, కౌన్సిలర్ల ఎన్నికలలో కూడ కమ్యూనిస్టులు మంచి విజయాలు సాధించారు. మితవాద శక్తులు ఓటమిపాలైనాయి. చిలీ రాజధాని ప్రాంతం కార్పొరేషన్‌కు కమ్యూనిస్టుపార్టీ నాయకుడు డేవియోల్ జాడ్సు ఎన్నికైనారు. చిలీ రాజధాని శాంటియాగోకు కమ్యూనిస్టుపార్టీ సభ్యురాలు, చిలీ విశ్వవిద్యాలయంలో ఆర్థికవేత్త అయిన లిరాసే హాస్లల్ ఎన్నికయ్యారు. మొత్తం మీద 27 మేయర్ స్థానాలకు కమ్యూనిస్టులు గెలుపొందారు. సరళీకరణనను వ్యతిరేకించే స్వాతంత్రులు 11 మందిమేయర్లుగా గెలిచారు. దానిలో చిలీలోని ప్రధాన నగరాలన్నీ కమ్యూనిస్టులు గెలవడం కొత్త పరిణామం.
1973లో సోషలిస్టు అయిన సాల్వడార్ ఆలెండీ చిలీకి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తగరపు గనులను జాతీయం చేసాడు. దాన్ని సహించలేని పెట్టుబడిదారులు, అమెరిక సామ్రాజ్యవాదులు సీఐఏ సాయంతో అధ్యక్ష భవనంపై సైన్యంతో దాడికి పూనుకున్నారు. హౌరా హౌరీగా జరిగిన కాల్పులలో ఆలెండీ కూడా తుపాకి పట్టి అధ్యక్ష భవనంలోనే ఉండి పోరాడుతూ కాల్పులలో వీర మరణం చెందాడు. పినోచట్ 18సంవత్సరాలు క్రూరమైన నియంతృత్వ పాలన అమలు జరిపాడు. అప్పటి నుంచి ఎవరు అధికారంలో ఉన్నా సరళీకరణ విధానాలనే అమలు జరపారు.
సరళీకరణ విధానాల ఫలితంగా దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. జీతాలు తక్కువ. విద్య, వైద్యం, సామాజిక భద్రత కరువైయింది. సమస్యలు పరిష్కారం కావాలని 2018 నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. 2019లో మెట్రో ఛార్జీలు విపరీతంగా పెంచారు. ఇప్పటి ఉద్యమానికి అదే నాంది అయింది. మొట్టమొదట విద్యార్థులు దేశవాపితంగా నిరసనలకు పూనుకున్నారు. క్రమంగా అన్ని తరగతుల ప్రజలు ఆ పోరాటంలోకి వచ్చారు. తమ సమస్యలకు కారణం పాలకుల విధానాలే దానికి ఈ రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తున్నది. కావున రాజ్యాంగాన్ని మార్చనిదే తమ భ్రతుకులు మారవని అనుభవంలో గ్రహించిన ప్రజలు రాజ్యాంగం మార్చాలని దాన్ని తామే రాసుకోవాలనే నిర్దారణకు వచ్చారు. ఈ మొత్తం నిరసనలలో కమ్యూనిస్టులు, సరళీకరణ విధానాలను వ్యతిరేకించే ప్రగతిశీల శక్తులు అగ్రభాగాన ఉన్నారు.
ఉద్యమాలు తారాస్థాయికి చేరి 2019లో 10లక్షల మంది నిరసనలలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిషత్‌ను పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోవడానికి ఒక పథకం వేసుకున్నారు. మొదట కొత్త రాజ్యాంగం రాయడంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. రాజ్యాంగ పరిషత్‌లో 155 మంది ఉండాలని అందులో 50శాతం మహిళలు, స్థానిక జాతుల ప్రతినిధులు ఉండాలని నిర్ణయించుకుని వారిని ఎన్నుకోవడానికి మే 16, 2021న ఎన్నికలు జరిపారు.
చిలీ జనాభా 1.6 మిలియన్లు. మే 16న ఎన్నికలలో 43శాతం మంది పాల్గొన్నారు. ఆ రోజు 155మంది రాజ్యాంగ పరిష్యత్ సభ్యులను, 16 మంది గవర్నర్లను, 345 మంది మేయర్లను, 2252 కౌన్సిలర్లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగినవి. ఈ ఎన్నికలలో కీలకమైన అంశం మితవాద శక్తులు చావుదెబ్బతినడం. 155మంది రాజ్యాంగ పరిష్యత్ సభ్యులలో ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేని వారు 65మంది గెలిచారు. వారు సరళీకరణ విధానాలకు వ్యతిరేకులు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ఫ్రంట్‌లో ఇతర వామపక్ష శక్తులు కలిసి రెండవ స్థానంలో 28సీట్లు పొందారు. మూడవ స్థానంలో అప్రుబో అంటే వామపక్ష బావాలకు దగ్గర ఉండే మరో సంస్థ 24 స్థానాలు గెలుచుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నయా ఉదారవాద సరళీకరణను వ్యతిరేకించే అన్ని శక్తులు కలసి 117స్థానాలు గెలుచుకున్నట్లు అయింది. మరో ప్రక్క ప్రస్తుత అధ్యక్షుడు పేనిరాస్ నాయకత్వంలోని మితవాద శక్తులు కేవలం 37సీట్లు పొందాయి. వారికి ప్రజలు బుద్దిచెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే చీలీ ప్రజలు మితవాదాన్ని ఓడించి పెట్టుబడిదారులకు పునాది అయిన సరళీకరణను తాము అంగీకరించమని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఉపాధి, విద్య, వైద్యం, నివాసం, సామాజిక భద్రతకి గ్యారంటీ ఇచ్చే రాజ్యాంగాన్ని రాసుకోవడానికి అవకాశం వచ్చింది. రాజ్యాంగ రచన ఒక సంవత్సరంలో పూర్తి కావాలి. ఆ రాజ్యాంగపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఆమోదం తీసుకుంటారు. అప్పుడు కొత్త రాజ్యాంగం అమలులోకి వస్తుంది. ఈ రాజ్యాంగ రచన ప్రక్రియలోని ప్రతిదశలో ప్రజలు తమ అభిప్రాయాలు తెలియచేసే అవకాశం కల్పించడమే చారిత్రాత్మకం అని గుర్తించాలి. రాజ్యాంగ పరిషత్‌లో 79 మంది మహిళలు ఎన్నికైనారు. ఎన్నికైన వాళ్ళలో 77శాతం సభ్యులు 45ఏండ్లలోపువారే ఉన్నారు. అంటే ఇప్పటితరం ఏమి కోరుకుంటున్నదో ఆ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం ఏర్పడింది. ఎక్కువ మంది వామపక్షాల వారు కావడంతో ప్రజా సమస్యలకు ప్రత్యేకించి మహిళలు, స్థానిక జాతులవారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తారనేది మనకు అర్థమవుతున్నది. ఏది ఏమైనా ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ సభ్యులు తమపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా ప్రజల ఆగ్రహాన్ని మనసులో పెట్టుకున్టి రాజ్యాంగం రచన జరిగేలా చూడాలి. అక్కడ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల మరమ్మతుకు ఈ కొత్త రాజ్యాంగం ఒక దశ దిశను ఏర్పాటు చేస్తుందని ఆశిద్దాం..