Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామా కనవేమిరా.. శ్రీరఘురామ కనవేమిరా
రమణీ లలామా నవ లావణ్యసీమ
ధరాపుత్రి సుమధాత్రి నడయాడి రాగా..
రామా కనవేమిరా.. సీతాస్వయంవరం ప్రకటించాక జనకుని కొలువులోకి ప్రవేశించిన జానకీదేవిని, సభాసదులందరూ కన్నార్పకుండా చూస్తుండగా, శ్రీరామచంద్రుడు ఇంకా కన్నెత్తి చూడడేమిటా అన్న చెలికత్తెల అంతరంగంలోని సందేహానికి ప్రతీకగా ఈ హరికథాగానం బహు ప్రసిద్ధి. ఇప్పుడు రామజన్మభూమిలో ఆలయం నిర్మాణాన్ని ప్రకటించాక ఃఃరామభక్తులుఃః సాగిస్తున్న ఃఃభూలీలలుఃః బయటపడుతుంటే తిరిగి ఃఃరామా కనవేమిరా..ఃః అని పాడుకోవాల్సిన పాడుకాలం దాపురించింది ఈ దేశానికి. అయోధ్యలో రాజుకున్న భూవివాదం రామాలయ నిర్మాణానికే కళంకంగా మారింది. పదే పది నిమిషాల్లో రెండుకోట్ల విలువచేసే భూమికి, పద్దెనిమిదిన్నర కోట్లకు ధర పెంచి మనీలాండరింగ్‌కు పాల్పడిన ఃఃట్రస్టుఃః పెద్దల భాగోతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ నేతలు, ట్రస్ట్ పెద్దల మధ్య పెద్ద మొత్తంలో వాటాలు చేతులు మారాయన్న కథనాలు నిజమైన రామభక్తుల హృదయాలను కలచివేస్తున్నాయి.
రామజన్మభూమి ట్రస్టుఃః కొనుగోలు చేసిన ఈ భూమి మందిర నిర్మాణ స్థలానికి ఆనుకుని ఉన్నది కూడా కాదు. ఎక్కడో దూరంగా అయోధ్య జిల్లాలోని బాగ్జైసీ అనే గ్రామంలో ఉన్న ఈ భూమి రామాలయానికి ఏ అవసరాల కోసం ఉపయోగపడుతుందో ట్రస్ట్ పెద్దలకే తెలియాలి. ఈ విషయం అటుంచితే, సుమారు మూడు ఎకరాలుండే ఆ భూమిని దాని యజమానులైన కుసుమ్ పాఠక్, హరీశ్పాఠక్ల నుంచి ఈ మార్చి 18న రవిమోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీలు రూ.రెండు కోట్లకు కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు దస్తావేజులపై సాక్షి సంతకాలు చేసినవారు అనిల్ మిశ్రా, హృషికేశ్ ఉపాధ్యాయ. వీరిలో అనిల్ మిశ్రా రామజన్మభూమి ట్రస్ట్ సభ్యుడు కాగా, హృషికేశ్ ఉపాధ్యాయ అయోధ్య మేయర్ కావడం గమనార్హం. విచిత్రంగా ఈ కొనుగోలు జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఆ భూమిని రామజన్మ భూమి ట్రస్ట్ 18.50 కోట్లకు కొనుగోలు చేసింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, విహెచ్పీ నేత చంపత్రారు, ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రాలు ఈ వ్యవహారానికి కర్తలు. మొదటి డీల్‌కు సాయంత్రం 5.11 గంటలకు స్టాంప్ పేపర్స్ కొంటే, రెండో డీల్‌కు సాయంత్రం 5.22 గంటలకు కొన్నారు. అంటే కేవలం పది నిమిషాల్లో ఆ భూమి ధర రెండు కోట్ల నుంచి పద్దెనిమిదిన్నర కోట్లకు పెరిగింది. పెరిగిన మొత్తం కూడా అసలు యజమానులకు కాక మధ్యవర్తులకు చేరింది. అసలక్కడ భూముల ధరలు ఆ స్థాయిలో ఉన్నాయా? అంటే లేవుగాక లేవు. దీనిని బట్టి జరిగిందేమిటో అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు గాక కాదు.
ఇప్పటికే రామజన్మభూమి అంశం దశాబ్దాలుగా వివాదాల మయం. అయినప్పటికీ రాముడిపట్ల విశ్వాసంతో ప్రజలు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. కానీ ఈ తాజా వివాదం ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేయడమే కాదు, మందిర నిర్మాణంలో ట్రస్ట్ విశ్వసనీయతనూ సవాలు చేస్తోంది. మూడువేల కోట్లకు పైగా విరాళాలు సేకరించారు. ప్రజల సొమ్ముతో జరిగే ఈ నిర్మాణంలో ఏమాత్రం పారదర్శకత లేకపోగా, ఈ అనుమానాలూ, వివాదాలూ నెలకొనడంతో... ఆలయ నిర్మాణాన్ని బీజేపీ సంఫ్ుపరివార్లు వ్యాపార నిలయంగా మార్చేశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఊరూరా విరాళాలు వసూలు చేసిన పరివారమంతా తెలుకుట్టిన దొంగల్లా నోరు మెదపకపోగా, ప్రభుత్వ పెద్దలూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించడమే కాదు, అనుమానాలను మరింత బలపరుస్తోంది. కోట్లాది మంది ప్రజలిచ్చిన సొమ్ము రాముని సాక్షిగా దుర్వినియోగమవుతుంటే, భక్తుల గుండెలు భగ్గుమంటున్నాయి.
రామా.. ఇప్పుడు దేశాన్ని కంసులు పాలిస్తున్నారు. నీ పేరిట చందాలు పోగుచేసుకుని దందాలకు పాల్పడుతున్నారు. సిగ్గులేని దోపిడీ దొంగలు మత విశ్వాసాలనూ మార్కెట్లో అమ్మేస్తున్నారుఃః అన్న రణదీప్ సుర్జేవాల వ్యాఖ్యలు ఈ అవినీతికీ, అవకతవకలకూ అద్దం పడుతున్నాయి. కాగా ఃఃఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదుఃః అన్న ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రారు నిర్లక్ష్యపు స్పందన... వారి జవాబుదారీతనంలోని డొల్లతనాన్ని వెల్లడిస్తోంది. రాముడన్నా, రామభక్తుల సొమ్ములన్నా ఇంత చులకనా..?! ఇదేనా వీరు నిత్యం వల్లించే శ్రీరాముని ఆదర్శాలకు ఇచ్చే విలువ?! రామా ఈ దౌర్జన్యం కనవేమిరా..?